X
మన్యం పులి
Action | Thriller | 02 Dec 2016 | U |
Telugu

మన్యం పులి స్టోరీ

మన్యం పులి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ లాల్, కమలినే ముకర్జీ, జగపతి బాబు, కిశోర్, నమిత, విను మోహన్, లాల్, సూరజ్ వెంజరమూద్, బాల, మాక్రంద్ దేశ్పాండే, నందు, సిద్దిక్వి, అంజలి అనేష్ ఊపాసన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వైశాక్ నిర్వహించారు మరియు నిర్మాత సింధురపువ్వు కృష్ణ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు. 

 

కథ


కేరళలో అడవి పక్కన పులివూరె అని ఓ చిన్న గ్రామం లో ఈ కథ జరుగుతుంది. అక్కడ అడవిలోంచి పులులు వచ్చి గ్రామస్థులపై దాడి చేసి చంపేస్తుంటాయి. అలా ఎప్పుడు పులి వచ్చినా అందరూ కుమార్ (మోహన్‌లాల్‌) కోసమే చూస్తుంటారు. లారీ డ్రైవర్‌గా పనిచేసే మురుగన్‌ పులులను వేటాడి చంపడంలో దిట్ట. పులి కుమార్‌ (మోహన్‌లాల్‌)....చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటాడు... తండ్రిని కళ్లెదుటే పెద్ద పులి తినేస్తుంది. అప్పట్నుంచి తమ్ముడు సుబ్రమణ్యంకి అన్నీ తానై బతుకుతుంటాడు. తన తండ్రిని చంపిందన్న కోపంతో చిన్న వయసులోనే పులిని తన బావ సాయంతో మట్టుబెడతాడు. అప్పటి నుంచి పులిని వేటాడ‌టంలో ఆరితేరుతాడు ఆ తర్వాత అడవిలో ఉండే పులియూరుకి పులుల బెడద రాకుండా కాపాడుతుంటాడు. అక్కడ అడివిలో తిరుగుతూంటే అనాథ అయిన మైనా (క‌మ‌లిని ముఖ‌ర్జీ)ని ప్రేమించి పెళ్లాడుతాడు. వాళ్ల‌కి చిన్ని అనే పాప కూడా ఉంటుంది. ప్రసాంతంగా సాగిపోతున్న అతని జీవితం... గతంలో తనతో గొడవపడ్డ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కిశోర్‌) అక్కడికి ట్రాన్సఫర్ అయిరావటంతో సమస్యలో పడుతుంది. ఆ రేంజర్ తో కుమార్‌కి గొడ‌వ‌లు మ‌ర‌లా తిర‌గ‌బెడుతాయి. దాంతో ఫారెస్ట్ ఆఫీస‌ర్ నుంచి అత‌నికి ఇబ్బందులు మొద‌ల‌వుతాయి. మరో ప్రక్క తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు సుబ్రమణ్యంకి ఉద్యోగం ఇస్తామని ఆశ చూపడంతో కుమార్...తప్పనిసరి పరిస్దితుల్లో ..అడవి నుంచి గంజాయిని డాడీ గిరిజ (జగపతిబాబు)కి చెందిన ఆయుర్వేద కంపెనీకి చేరవేస్తాడు. అది పోలీసలకు తెలిసి అతన్ని వెంబడిస్తారు. కానీ.. నిజానికి డాడీ గిరిజ(జగపతిబాబు) కంపెనీ ఆయుర్వేద మందులు తయారు చేయడం లేదనీ, అదో గంజాయితో డ్రగ్స్ తయారు చేసే కంపెనీ అని పులి కుమార్‌కి తెలుస్తుంది. ఈ లోగా ఈ విషయం తెలిసిందని కుమార్ తమ్ముడుపై డాడీ మనుష్యలు ఎటాక్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పులి కుమార్‌కీ మైనా (కమలినీ ముఖర్జీ).. జూలీ (నమిత)లకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? లాంటి విషయాలు చూడాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+