మసాల సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, వెంకటేష్, షాజన్‌పదంసి, అంజిలి, అలీ, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్.ఎస్.నారాయణ,పోసాని కృష్ణ మురళి, జె.పి, భరత్, కాదంబరి కిరణ్, రామ్‌జగన్, అనంత్, గీతాంజలి, కోవై సరళ, శ్రీలక్ష్మి తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె.విజయభాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత డి సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఒక అబద్దం ఆడితే ...ఆ అబద్దం కప్పి పుచ్చుకోవటానికి మరో అబద్దం...దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరో అబద్దం ఆడాల్సిన పరిస్ధితి వస్తుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో ... కోర్టు కేసులో ఓడిపోయి....ఆ కేసు కోసం ఆస్ధి పోగొట్టుకుని, కేసు ఓడగొట్టినందుకు కోపంలో ఆ లాయిర్ ని కొట్టి ఇరుక్కపోయిన రహమాన్(రామ్) నిరాశలో ఏం చేయలేని స్ధితిలో ఉంటాడు. అప్పుడు తన తండ్రి స్నేహితుడైన నారాయణ(ఎంఎస్ నారాయణ) సహాయంతో అతని అక్క సానియా(అంజలి) పెళ్లి కోసం, కుటుంబ పోషణ కోసం భీమరాజపురం వెళ్తాడు. అక్కడ ఊరి పెద్ద బలరాం(వెంకటేష్). బట్లల్ ఇంగ్లీష్ మాట్లాడే అతనికి అబద్దం ఆడేవాళ్లు అంటే మంట..చంపటానికి సైతం వెనుకాడడు. అయితే ఆ విలేజ్ వెళ్లగానే రహమాన్ కొన్ని తప్పని పరిస్దితుల్లో...అబద్దమాడి తన పేరు రామ్‌గా పేరు మార్చుకుని ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ నుంచి...వరసగా ఒక అబద్దం బయిటపడకుండా దాచటం కోసం..మరొకటి..దాన్ని దాచటానికి మరొకటి..చైన్ లా అబద్దాలు అల్లుకుంటూ ముందుకు వెళ్లాల్సిన స్థితి వస్తుంది. అలాంటి స్ధితిలో బలరామ్ కి నిజం ఎలా తెలిసింది.... రహమాన్ ఎలా బయిటపడ్డాడు..కథలో హీరోయిన్స్ పాత్రేమిటి తెరపై చూడాల్సిన మిగతా కథ.