మట్టి కుస్తీ సినిమా ఫ్యామిలీ, స్పోర్ట్స్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చెల్లా అయ్యావు వహించారు. నిర్మాతలు విష్ణు విశాల్, రవి తేజ కలిసి నిర్మించారు. సంగీతం జస్టిన్ ప్రభాకరన్ అందించారు.
కథ
బాబాయ్ కలను సాకారం చేయడానికి కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) కుస్తీ క్రీడలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. కుస్తీ కారణంగా పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఇక ఊరిలో పనీపాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే వీర (విష్ణు విశాల్) కబాడ్డీ ప్లేయర్. రెండు అబద్దాలు ఆడి వీరతో కీర్తి పెళ్లిని ఆమె కుటుంబం జరిపిస్తుంది. అయితే ఓ సంఘటన కారణంగా ఇద్దరికి అభిప్రాయభేదాలు తలెత్తి విడిపోతారు. కుస్తీ క్రీడాకారిణి కావడం వల్ల కీర్తి జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది? కీర్తీ బాబాయ్ కల ఏమిటి? కీర్తి పెళ్లి కోసం రెండు అబద్దాలు ఏమిటి? కీర్తీ, వీర ఎందుకు విడిపోయారు? భర్తతో విడిపోయిన తర్వాత కీర్తీ మళ్లీ కుస్తీని ఎందుకు మొదలుపెట్టింది? కీర్తి కోసం వీర ఎందుకు కుస్తీ క్రీడను ఎంచుకొన్నాడు? కుస్తీ క్రీడలో వీర ఛాంపియన్ అయ్యాడా? కీర్తీని వీర అర్ధం చేసుకొన్నాడా? చివరకు కీర్తీ, వీర ఎలా కలుసుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే మట్టి కుస్తీ సినిమా కథ.
థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం తాజాగా వెల్లడించింది.