X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్ టైర్ 2 హీరోల టాప్ 5 బిగ్గెస్ట్ థియేట్రికల్ బిజినెస్ మూవీస్

Author Administrator | Updated: Monday, July 17, 2023, 07:39 PM [IST]

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు, టాప్ హీరోలు, స్టార్ హీరోలు అండ్ అప్ కమింగ్ యంగ్ హీరోలు అంటూ అందరికీ సపరేట్ కాటగిరీలు ఉన్నాయి. సినిమాల పరంగా పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఎప్పుడు ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో ఎవ్వరం చెప్పలేము. కొన్ని సినిమాలు చిన్నవి అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలు పెద్దవి అయినా అప్పుడప్పుడు అంచనాలను తప్పుతూ ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు అంటే కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితులు లేవు. ఇత‌ర భాష‌ల్లో కూడా మ‌న హీరోల‌కు మార్కెట్ ఉండ‌టంతో.. ఆ భాష‌ల్లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లోనే అవుతోంది. టైర్ 2 హీరోలలో టాప్ 5 బిగ్గెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ మూవీస్ చూద్దాం


cover image
లైగర్
1

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. మొత్తంగా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

దసరా
2

నాచురల్ స్టార్ నాని పక్కా మాస్ మసాలా మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీ మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఈ సినిమా బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్లు వ్యాపారం జరిగింది.

అఖిల్
3

అఖిల్ , వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనేక అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అఖిల్ కు బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ మాత్రం ఒక రేంజ్ లో జరిగింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది

ది వారియర్
4

రామ్ పోతినేని ది వారియర్ సినిమా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలైంది.  ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఎవరూ ఊహించని రేంజ్ లో జరిగింది దాదాపు 40 కోట్ల బిజినెస్ జరిగింది 

డియర్ కామ్రేడ్
5

గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న  జోడిగా వచ్చిన డియర్ కామ్రేడ్ అంచనాలను అందుకోలేక పోయింది. ఈ సినిమాకి  భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేసారి విడుదలైంది. డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. రూ. 34 కోట్లు జరిగింది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+