X
మయురి
Horror | 17 Sep 2015 | U/A |
Telugu

మయురి స్టోరీ

మయురి సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నయనతార, ఆరి, అంజత్ ఖాన్, లక్ష్మి ప్రియ, రోబో శంకర్, మిమే గోపి, శరత్  తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం అశ్విని సరవాణన్ నిర్వహించారు మరియు నిర్మాతలు స్వేత లన, వరున్ కుమార్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాన్ ఏతాన్ యోహన్న్ స్వరాలు సమకుర్చారు. 

కథ

నటనను వృత్తిగా ఎంచుకున్న మ‌యూరి (న‌య‌న‌తార‌), అర్జున్(అరి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్న గొడవలతో ఇద్దరూ విడిపోతారు. అర్జున్ మయూరితో మళ్లీ కలవాని ఎంత ప్రయత్నించినా మయూరి మాత్రం అతన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తన ఫ్రెండ్ స్వాతి ఇంట్లో తన పాపతో మీరాతో కలిసి జీవితస్తుంటుంది మయూరి. డబ్బు సమస్యల్లో ఉన్న మయూరికి అర్జున్ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు...కానీ మయూరి మాత్రం అతని డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడదు. అప్పులు తీర్చడానికి, బతుకు బండి సాగించడానికి ఏవో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ చేస్తూనే నటిగా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది మయూరి. కాగా...మాయావ‌నం అనే భ‌యంక‌ర‌మైన అడ‌విలో మాయ అనే మ‌హిళ ఆత్మ తిరుగుతుంద‌ని, మాయపై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌ుపడానికి అడవిలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదనే ప్రచారం జరుగుతుంది. ఈ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆర్.కె. ‘చీకటి' అనే సినిమాను తెరకెక్కిస్తాడు. సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగా తమ సినిమాను ఒంటరిగా భయపడకుండా చూస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి మయూరి ఆ సినిమాని ఒంటరిగా చూడటానికి ఒప్పుకుంటుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడే మయూరికి, ఆ సినిమాకు ఒక సంబంధం ఉందన్న నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ మాయ ఎవరు? మయూరికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+