X
మయురి

మయురి

Horror | 17 Sep 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మయురి స్టోరీ

మయురి సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నయనతార, ఆరి, అంజత్ ఖాన్, లక్ష్మి ప్రియ, రోబో శంకర్, మిమే గోపి, శరత్  తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం అశ్విని సరవాణన్ నిర్వహించారు మరియు నిర్మాతలు స్వేత లన, వరున్ కుమార్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాన్ ఏతాన్ యోహన్న్ స్వరాలు సమకుర్చారు.   కథ నటనను వృత్తిగా ఎంచుకున్న మ‌యూరి (న‌య‌న‌తార‌), అర్జున్(అరి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. చిన్న గొడవలతో ఇద్దరూ విడిపోతారు. అర్జున్ మయూరితో మళ్లీ కలవాని ఎంత ప్రయత్నించినా మయూరి మాత్రం అతన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తన ఫ్రెండ్ స్వాతి ఇంట్లో తన పాపతో మీరాతో కలిసి జీవితస్తుంటుంది మయూరి. డబ్బు సమస్యల్లో ఉన్న మయూరికి అర్జున్ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు...కానీ మయూరి మాత్రం అతని డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడదు. అప్పులు తీర్చడానికి, బతుకు బండి సాగించడానికి ఏవో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ చేస్తూనే నటిగా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది మయూరి. కాగా...మాయావ‌నం అనే భ‌యంక‌ర‌మైన అడ‌విలో మాయ అనే మ‌హిళ ఆత్మ తిరుగుతుంద‌ని, మాయపై ప‌రిశోధ‌న‌లు జ‌ర‌ుపడానికి అడవిలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రాలేదనే ప్రచారం జరుగుతుంది. ఈ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆర్.కె. ‘చీకటి' అనే సినిమాను తెరకెక్కిస్తాడు. సినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగా తమ సినిమాను ఒంటరిగా భయపడకుండా చూస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తానని అనౌన్స్ చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి మయూరి ఆ సినిమాని ఒంటరిగా చూడటానికి ఒప్పుకుంటుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడే మయూరికి, ఆ సినిమాకు ఒక సంబంధం ఉందన్న నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అసలు ఈ మాయ ఎవరు? మయూరికి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే.
Read More

మయురి కాస్ట్ & క్రూ

మయురి సిబ్బంది సమాచారం

దర్శకత్వం అశ్విన్ శరవణన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రోన్ ఏతాన్ యోహాన్
నిర్మాత స్వేత లన, వరున్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మయురి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు ప్రేక్షకులకు అసలు సిసలైన హారర్ అనుభూతిని కలిగించాడని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్క్రీన్ ప్లే ప్రేక్షకుడు కథలోకి పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయిపోతూ ఆ 'మాయా' ప్రపంచంలోకి వెళ్లిపోయి, క్యారెక్టర్ల తాలూకు భావోద్వేగాల్ని అనుభవించేలా చేస్తుంది. కథకు తగిన విధంగా రాన్‌ యోహాన్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరింత భయానికి గురి చేస్తుంది. మద్య మధ్యలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అసలు సిసలైన హారర్ సినిమా అంటే ఇలానే ఉంటుంది నేలా ఉంది. ప్రేక్షకులు కొత్తరకం హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందుతారు. అయితే కథను చెప్పే క్రమంలో దర్శకుడు ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజ్ చేసాడు. సినిమాలో.... మరో సినిమాను చూపిస్తూ దాన్ని రియాల్టీకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేసాడు. ఈ క్రమంలో కొంత సేపు ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు. అయితే అసలు విషయం ఏమిటనేది క్లైమాక్స్ లో స్పష్టత వస్తుంది. దీంతో పాటు సినిమా చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. చూపిన సీన్లనే మళ్లీ చూపించడం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది.

మయురి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మయురి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+