మిణుగురులు సినిమా డ్రామా మరియు సమాజంలో జరుగుతున్నా అన్యాయలకు ఆధారంగా రుపోందించిన చిత్రం ఇందులో దీపక్ సరోజ్, సుహాసిని మణిరత్నం, అశిష్ విద్యార్థి, సాయి తేజ తదితరులు ప్రదానపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి నిర్మాత-దర్శకుడు: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంగీతం: జోశ్యభట్ల శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
కథ విషయానికి వస్తే...సినిమా దర్శకుడవుదామను కలలు కనే ఒక టీనేజ్ కుర్రాడు రాజు (దీపక్ సరోజ్)కి ప్రమాదంలో కళ్ళు పోతాయి. రాజుని పెంచలేని తండ్రి ఒక అంధవిద్యార్థుల హాస్టల్ లో వేస్తాడు. హాస్టల్ వార్దన్ నారాయణ(ఆశిష్ విధ్యార్థి) దుర్మార్గంతో సతమతమౌతున్న విధ్యార్థుల సమస్యలు తీర్చడానికి రాజు సినిమాని ఆయుధంగా ఎలా ఎంచుకున్నాడు. కలెక్టర్ కిరణ్మయి (సుహాసిని) సహాయంతో చివరకు వాళ్ళ సమస్య ఎలా తీరింది అనేది తెరమీద చూడాల్సిన సినిమా.