X
Home టాప్ లిస్టింగ్

2023 ఫస్ట్ హాఫ్ టాప్ హిట్ తెలుగు మూవీస్

Author Administrator | Updated: Tuesday, June 13, 2023, 08:31 AM [IST]

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఏడాది దాదాపు రెండు వంద‌ల చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇందులో అనువాద చిత్రాలు కూడా ఉంటాయి. ఇన్ని సినిమాలు వచ్చినా స‌క్సెస్ రేట్ మాత్రం 10 శాత‌మే ఉంటుంది. అలాంటి స‌క్సెస్ రేటున్న మ‌న ఇండ‌స్ట్రీలో మే నెల వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన చిత్రాలు ఏవో చూద్దాం...


cover image
వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైంది. డైరెక్ట‌ర్ బాబీ చిరంజీవిని చూపించిన తీరు.. ఆయ‌న డాన్సుల‌కు ఫ్యాన్స్, ప్రేక్ష‌కుల‌కు ఫిదా అయ్యారు. ఏకంగా రూ.235 కోట్ల మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను సినిమా సాధించింది. ఇందులో చిరంజీవి త‌మ్ముడు పాత్ర‌లో ర‌వితేజ న‌టించ‌టం విశేషం. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. 

వీర సింహా రెడ్డి

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన సినిమా ఇది. ఇది కూడా సంక్రాంతి బ‌రిలోకే దిగింది. వంద కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్  సాధించింది. అఖండ త‌ర్వాత బాల‌య్య‌కు మ‌రో హిట్ వ‌చ్చింది. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేశారు. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌. 

వారసుడు

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ తెలుగు, త‌మిళంలో చేసిన తొలి చిత్రం వార‌సుడు. తెలుగు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌, ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీలు సినిమాను రూపొందించ‌టం విశేషం. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. విజ‌య్‌కు తెలుగులో మార్కెట్‌ను ఇంకాస్త పెంచ‌టంలో వార‌సుడు హెల్ప్ అయ్యింద‌నే చెప్పాలి. 

రైటర్ పద్మభూషణ్

సుహాస్ హీరోగా న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌.. ఫిబ్ర‌వ‌రి 3న రిలీజైంది. ష‌ణ్ముక్ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. ఇందులో ఇంట్లో మ‌హిళ‌ల‌కు కెరీర్‌లో ఏదో సాధించాల‌నే త‌ప‌న ఉంటుంది. వారిని ఎంక‌రేజ్ చేయాల‌నే పాయింట్‌తో తెర‌కెక్కింది. త‌క్కువ బ‌డ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌ను అందుకుంది. 

 

సార్

గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌పై ప్రైవేట్ స్కూల్స్ ఆధిప‌త్యం చెలాయించిన ఓ ద‌శ‌కం నాటి ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమా సార్‌. తెలుగు నిర్మాత‌లు సూర్య‌దేవ‌ర నాగవంశీ, సాయి సౌజ‌న్య‌ల‌తో పాటు డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి కూడా తెలుగువాడే కావ‌టం విశేషం. ధ‌నుష్ న‌టించిన తొలి తెలుగు సినిమా ఇది. హీరోకున్న క్రేజ్‌, మార్కెట్‌ను బ‌ట్టి చూస్తే సార్‌కు వ‌చ్చిన క‌లెక్షన్స్ ప‌రంగా..ఇది త‌మిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయ్యింద‌నాలి.

వినరో భాగ్యము విష్ణు కథ

కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా రూపొందిన చిత్రం విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌. ముర‌ళీ కృష్ణ అబ్బూరు ద‌ర్శ‌కుడు. గీతాఆర్ట్స్ 2లో బ‌న్నీవాస్ ఈ సినిమాను నిర్మించారు. మినిమం బ‌డ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యాన్నే ద‌క్కించుకుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ అయిన‌ప్పటికీ దాన్ని కామెడీ కోణంలో తెర‌కెక్కించిన విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 

బలగం

క‌మెడియ‌న్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ‌ల‌గం. తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌పై తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. దిల్ రాజు పెట్టిన బ‌డ్జెట్‌కు మూడు నాలుగింత‌లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయ‌నే చెప్పాలి. ప‌ల్లెటూరులోని జ‌నాలంద‌రూ బ‌ళ్లు క‌ట్టుకుని వ‌చ్చి మ‌రీ సినిమాను చూశారు. అలాగే చాలా ఊళ్లలో తెర‌లు ఏర్పాటు చేసుకుని కూడా సినిమాను చూశారు. 

దాస్ కా ధమ్కీ

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వంలో వ‌హించిన సినిమా దాస్ కా ధ‌మ్కీ. నిర్మాత‌గా కూడా త‌నే కావ‌టం విశేషం. ఇందులో ఆయ‌న ద్విపాత్రాభిన‌యం చేశారు. సినిమాను తెర‌కెక్కించిన తీరు, క‌థ‌..క‌థ‌నం అన్నీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టంతో సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 

దసరా

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ ద‌స‌రా. వంద కోట్ల మేర‌కు క‌లెక్ష‌న్స్‌ సాధించింది. నాని కెరీర్‌లో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్‌. ర‌గ్డ్ లుక్‌లో నాని, కీర్తి సురేష్‌ల న‌ట‌న మెప్పించింది. డెబ్యూ డైరెక్ట‌రే అయినా శ్రీకాంత్ ఓదెల సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సూప‌ర్బ్‌గా తెర‌కెక్కించటం, పాట‌లు అన్నీ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యి సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. 

విరూపాక్ష

యాక్సిడెంట్ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం విరూపాక్ష‌. కార్తీక్ దండు తెర‌కెక్కించిన మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్‌లో బ్లాక్ బ‌స్టర్ స‌క్సెస్‌ను సాధించింది. ఏకంగా వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి సాయి ధ‌ర‌మ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఇది నిలిచింది. ఇందులో సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. 

బిచ్చగాడు 2

విజ‌య్ ఆంటోని ద‌ర్శ‌క నిర్మాణంలో వ‌చ్చిన బిచ్చ‌గాడు సినిమాకు తెలుగులో మంచి విజ‌యం ద‌క్కింది. త‌మిళం కంటే ఇక్క‌డే మంచి క‌లెక్ష‌న్స్ రావ‌టంపై టీమ్ చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. బిచ్చగాడు 3 సినిమాను కూడా చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా విజయ్ తెలిపారు. 

2018లో కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు వ‌చ్చి చాలా ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి అండ‌గా ప్ర‌జ‌లు కూడా నిల‌బ‌డ్డారు. అలాంటి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం కేర‌ళ‌లో ఏకంగా రూ.160 కోట్ల‌కు పైగానే రాబ‌ట్టింది. తెలుగులోనూ దాదాపు రూ.12 కోట్ల మేర‌కు గ్రాస్ వ‌సూళ్ల‌ను కలెక్ట్ చేయ‌టం విశేషం. 

మేమ్ ఫేమస్

సుమంత్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం మేము ఫేమ‌స్‌. తెలంగాణ నేప‌థ్యంలోనే సినిమా తెరకెక్కింది. ఆవారా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు ఊరికి ఎలాంటి మంచి చేశార‌నే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. లో బ‌డ్జెట్‌లో చేసిన ఈ సినిమా భారీ విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+