X
మిస్ ఇండియా
Drama | 04 Nov 2020 |
Telugu

మిస్ ఇండియా స్టోరీ

మిస్ ఇండియా సినిమా డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కీర్తి సురేష్, జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భాణు శ్రీ మెహ్రా, పూజిత పొన్నడ, కమల్ కామరాజు, నధియ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నరేంద్ర నాథ్ అందించారు. మహేష్ కోనేరు నిర్మాత నిర్మించారు. సంగీతం తమన్ అందించారు. 

కథ

మానస సంయుక్త (కీర్తి సురేష్) మధ్య తరగతి అమ్మాయి. కానీ ఆశలు, ఆశయాలు, ఆలోచనలు మాత్రం ఉన్నతంగా ఉంటాయి. పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని చిన్న తనం నుంచే కలలు కంటుంది. ఓ అమ్మాయి ఇలాంటి కలలు కంటే సాధారణంగా ఎదురయ్యే అడ్డంకులు ప్రతికూల పరిస్థితులే మానసకు ఎదురవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరూ ప్రోత్సహించరు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త (జగపతి బాబు) నుంచి సవాల్ ఎదురువుతుంది. ఈ నేపథ్యంలో ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమవుతుంది. బిజినెస్ ప్రారంభించానుకున్న మానసకు ఎలాంటి ఐడియా వచ్చింది? వచ్చిన ఆ ఆలోచనలకు పెట్టుబడి ఎవరు పెట్టారు? అప్పటికే వ్యాపార రంగంలో టైకూన్ అయిన కైలాష్‍ (జగపతిబాబు) మానసను ఎలా అడ్డకుంటాడు? అసలు ఏమీ లేని మానస వ్యాపారవేత్తగా ఎలా ఎదుగుతుంది? ఈ చిత్రంలో సంయుక్త ఎందుకు టీ బిజినెస్ ప్రారంభించాలనుకొన్నారు? కాఫీ ఎక్కువ తాగే విదేశాల్లో టీ బిజినెస్ పెట్టడానికి కారణమేమిటి? కుటుంబ సభ్యులు వ్యతిరేకించిన సమయంలో ఆమెకు ఎవరు అండగా నిలబడ్డారు. ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ప్రతిరూపమే మిస్ ఇండియా చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+