X
నాంది
Thriller | 19 Feb 2021 | U/A | 141 Mins
Telugu

నాంది స్టోరీ

నాంది సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో అల్లరి నరేష్. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీన్‌, ప్రియదర్శి, దేవీ ప్రసాద్‌, వినయ్‌ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.  ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.  శ్రీచరణ్‌ పాకల బాణీలు కడుతున్నారు. 

కథ 
బండి సూర్య ప్రకాశ్ ( అల్లరి నరేష్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తలిదండ్రులు, భార్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటారు. జీవితం హ్యాపీగా సాగిపోతుంటే పౌరహక్కుల నాయకుడు, అడ్వకేట్ రాజ్‌గోపాల్ (సీవీఎల్ నరసింహరావు) హత్య కేసులో సూర్య ప్రకాశ్‌ను ఏసీపీ కిషోర్ (హరీష్ ఉత్తమన్) అరెస్ట్ చేసి జైలుకు పంపుతాడు. ఐదేళ్ల తర్వాత సూర్య ప్రకాశ్‌ను విడిపించేందుకు లాయర్ ఆధ్య (వరలక్ష్మి శరత్ కుమార్) కేసును టేకప్ చేసుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సూర్య ప్రకాశ్ ఎందుకు జైలుకు వెళ్లాడు? సూర్య ప్రకాశ్‌ను ఏసీపీ కిషోర్ ఎందుకు టార్గెట్ చేశారు. రాజ్‌ గోపాల్ హత్య కేసుకు మాజీ హోమంత్రి నాగేందర్ (వినయ్ వర్మ)కు లింక్ ఏమిటి? సూర్య ప్రకాశ్ నిర్ధోషి అని లాయర్ ఆద్య ఎందుకు వాదించడానికి ముందుకు వచ్చింది? ఈ కేసులో సూర్య ప్రకాశ్‌కు న్యాయం జరిగిందా? న్యాయాన్ని పొందేందుకు ఎలాంటి కష్టాలను సూర్య ప్రకాశ్, ఆద్య ఎదుర్కొన్నారనే ప్రశ్నలకు సమాధానమే నాంది చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+