X
నక్షత్రం
Action | 04 Aug 2017 | U/A |
Telugu

నక్షత్రం స్టోరీ

నక్షత్రం సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రజ్ఞ జైస్వాల్, రెజీన కసాండ్ర, తనీష్, ప్రకాష్ రాజ్, శ్రియ సరన్, బ్రహ్మాజి, జె డి చక్రవర్తి, శివాజి రాజా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ వంశీ నిర్వహించారు మరియు నిర్మాతలు శ్రీనివాసులు కె, వేణుగోపాల్ ఎస్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ స్వరాలు సమకుర్చరు.

కథ


పోలీసుశాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరాలన్నది రామారావు (సందీప్ కిషన్) జీవిత లక్ష్యం. మామ కూతురు జమున ( రెజీనా)తో ప్రేమలో ఉంటాడు. రామారావు ఇంటిలో మూడు తరాల వారు పోలీసుశాఖలో సేవలందిస్తూ రావడమే ఆయన లక్ష్యం వెనుక ఉన్న స్ఫూర్తి. ఎస్ఐ ఉద్యోగం కోసం నానా కష్టాలు పడి చివరికి ఉద్యోగం సంపాదించే రేంజ్‌కు చేరుకొంటాడు. ఆ క్రమంలో ఆ సంఘటన కారణంగా ఆ ఉద్యోగాన్ని పొందలేకపోతాడు. తన తల్లి కన్న కల నిజం కాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకొంటాడు. ఆ సమయంలో సీతారాం (శివాజీరాజా) కాపాడి.. పోలీసు ఉద్యోగం పొందలేకపోయినా పర్వాలేదు. ఈ పోలీసు డ్రెస్ వేసుకొని పౌరుడిగా బాధ్యత నెరవేర్చు అని చెప్పి అలెగ్జాండర్ నేమ్ ప్లేట్ ఉన్న డ్రస్‌ను ఇస్తాడు. అలెగ్జాండర్ డ్రస్ వేసుకొని పోలీసు ఉద్యోగం చేస్తుండగా ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ ఇనెస్విగేషన్‌లో అలెగ్జాండర్ పేరుతో డ్రస్ వేసుకొని ఉన్న రామారావు కనిపిస్తాడు. అప్పటివరకు పోలీస్ శాఖ వెతుకుతున్న ఐపీఎస్ అధికారి అలెగ్జాండర్ ( సాయి ధరమ్ తేజ్) డ్రస్ వేసుకొని ఉన్న రామారావును పట్టుకొచ్చి ఇంటారాగేషన్ చేస్తారు. అలెగ్జాండర్ ఎక్కడ ఉన్నాడు? అలెగ్జాండర్‌ను ఏమి చేశావు లాంటి ప్రశ్నలతో చితకబాదుతారు. ఇంతకీ ఐపీఎస్ అలెగ్జాండర్ ఏమైపోయాడు. ప్రగ్యా జైస్వాల్‌కు అలెగ్జాండర్‌కు సంబంధం ఏమిటి? కమిషనర్ (ప్రకాశ్ రాజ్), ఆయన కొడుకు (తనీష్) కథకు సంబంధమేమిటీ? అనే ప్రశ్నలకు సమాధానమే నక్షత్రం సినిమా కథ.

 


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+