X
తెలుగు » సినిమాలు » నక్షత్రం
నక్షత్రం

నక్షత్రం

Action | 04 Aug 2017 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నక్షత్రం స్టోరీ

నక్షత్రం సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, ప్రజ్ఞ జైస్వాల్, రెజీన కసాండ్ర, తనీష్, ప్రకాష్ రాజ్, శ్రియ సరన్, బ్రహ్మాజి, జె డి చక్రవర్తి, శివాజి రాజా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ వంశీ నిర్వహించారు మరియు నిర్మాతలు శ్రీనివాసులు కె, వేణుగోపాల్ ఎస్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ స్వరాలు సమకుర్చరు. కథ పోలీసుశాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగంలో చేరాలన్నది రామారావు (సందీప్ కిషన్) జీవిత లక్ష్యం. మామ కూతురు జమున ( రెజీనా)తో ప్రేమలో ఉంటాడు. రామారావు ఇంటిలో మూడు తరాల వారు పోలీసుశాఖలో సేవలందిస్తూ రావడమే ఆయన లక్ష్యం వెనుక ఉన్న స్ఫూర్తి. ఎస్ఐ ఉద్యోగం కోసం నానా కష్టాలు పడి చివరికి ఉద్యోగం సంపాదించే రేంజ్‌కు చేరుకొంటాడు. ఆ క్రమంలో ఆ సంఘటన కారణంగా ఆ ఉద్యోగాన్ని పొందలేకపోతాడు. తన తల్లి కన్న కల నిజం కాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకొంటాడు. ఆ సమయంలో సీతారాం (శివాజీరాజా) కాపాడి.. పోలీసు ఉద్యోగం పొందలేకపోయినా పర్వాలేదు. ఈ పోలీసు డ్రెస్ వేసుకొని పౌరుడిగా బాధ్యత నెరవేర్చు అని చెప్పి అలెగ్జాండర్ నేమ్ ప్లేట్ ఉన్న డ్రస్‌ను ఇస్తాడు. అలెగ్జాండర్ డ్రస్ వేసుకొని పోలీసు ఉద్యోగం చేస్తుండగా ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ ఇనెస్విగేషన్‌లో అలెగ్జాండర్ పేరుతో డ్రస్ వేసుకొని ఉన్న రామారావు కనిపిస్తాడు. అప్పటివరకు పోలీస్ శాఖ వెతుకుతున్న ఐపీఎస్ అధికారి అలెగ్జాండర్ ( సాయి ధరమ్ తేజ్) డ్రస్ వేసుకొని ఉన్న రామారావును పట్టుకొచ్చి ఇంటారాగేషన్ చేస్తారు. అలెగ్జాండర్ ఎక్కడ ఉన్నాడు? అలెగ్జాండర్‌ను ఏమి చేశావు లాంటి ప్రశ్నలతో చితకబాదుతారు. ఇంతకీ ఐపీఎస్ అలెగ్జాండర్ ఏమైపోయాడు. ప్రగ్యా జైస్వాల్‌కు అలెగ్జాండర్‌కు సంబంధం ఏమిటి? కమిషనర్ (ప్రకాశ్ రాజ్), ఆయన కొడుకు (తనీష్) కథకు సంబంధమేమిటీ? అనే ప్రశ్నలకు సమాధానమే నక్షత్రం సినిమా కథ.  
Read More

నక్షత్రం కాస్ట్ & క్రూ

నక్షత్రం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కృష్ణవంశీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భీమ్స్ సిసిరోలియో
నిర్మాత శ్రీనివాసులు కె, వేణుగోపాల్ ఎస్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నక్షత్రం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
రామారావుగా సందీప్ కిషన్ పోలీసు ఉద్యోగం పొందడానికి పడిన కష్టాలను, సినిమాల్లో డ్యాన్సర్‌గా రాణించాలనే కోరిక ఉన్న జమున (రెజీనా) ఇతర పాత్రల పరిచయంతో సినిమా గడిచిపోతుంది. డ్రగ్స్ అలవాటు పడిన తనీష్ విలనిజం, మాఫియా కార్యక్రమాలతో అలా ఇంటర్వెల్ వరకు సినిమాను దర్శకుడు కృష్ణవంశీ బలవంతంగా లాక్కొస్తాడు. ఇక ఇంటర్వెల్‌లో అలెగ్జాండర్ పాత్రను తీసుకొచ్చి ప్రేక్షకులకు ఓ ట్విస్ట్ ఇస్తాడు. దాంతో రెండో భాగంలో అలెగ్గాండర్ పాత్రపై ప్రేక్షకులకు ఆసక్తి కల్పించడంలో కృష్ణవంశీ తన ప్రతిభను చూపాడు. తీరా సెకండాఫ్ మొదలైన తర్వాత కథ చాలా పేలవంగా సాగడం, సన్నివేశాలు, డైలాగ్స్‌లో దమ్ము లేకపోవడంతో సినిమా పరిస్థితి ఏంటో అప్పుడే తేలిపోతుంది. తనీష్ విలనిజం కాస్త కొత్తగా అనిపించడం సెకండాఫ్‌లో కొంత ఊరటలా ఉంటుంది. ఫస్టాఫ్‌లోను, సెకండాఫ్‌లోను రొటీన్ ఫార్మూలాతో విసుగు పెట్టించాడు దర్శకుడు. కథ ఏం చెప్పాలనుకొంటున్నాడో ఓ పట్టాన అర్థం కాదు. ఎంత సేపు పాత్రల చుట్టూ.. అనవసరంగా మధ్యలో పాటలను జొప్పించి సినిమాను చాలా నాసిరకంగా చుట్టేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. 24 విభాగాల్లో ఏ ఒక్క విభాగం ప్రతిభ ఆకట్టుకొనే విధంగా లేకపోవడం ఈ సినిమా పరిస్థితికి అద్దం పట్టింది. ఓవరాల్‌గా రెజీనా, ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోత, కొంతలో కొంత తనీష్ విలన్ పాత్ర ప్రేక్షకుడికి ఊరటను కలిగిస్తాయి.

నక్షత్రం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నక్షత్రం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+