నరుడా డోనరుడా సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, భద్రమ్, జబర్‌దస్త్ శేషు, సుంకరలక్ష్మి, పుష్ప, చలపతిరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మల్లిక్ రామ్ నిర్వహించారు మరియు నిర్మాతలు వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ చరణ్ స్వరాలు సమకుర్చరు.
కథ
క్రికెటర్ విక్కీ (సుమంత్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తన అవసరాల కోసం ఏదైనా చివరకు తన ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లను కూడా అమ్మేసే టైపు. అతని తల్లి (శ్రీలక్ష్మి) బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది.. నాయనమ్మలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. పనిలో పనిగా ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్ (పల్లవి సుభాష్) అనే బెంగాలీ అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. తాను కూడా కాదనటమెందుకు అని మెల్లమెల్లగా విక్కీతో ప్రేమలో పడిపోతుంది. అయితే తాను ఇది వరకే ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది. విక్కీ మాత్రం ఆషిమా దగ్గర ఓ నిజం దాస్తాడు. కానీ ఆషిమా దగ్గర దాచిన విషయం వింటే ఆమె ఒప్పుకోదని అనుమానం. ఇంతకీ విక్కీ దాచిన నిజం ఏమిటీ అంటే.. తనో స్పెర్మ్ డోనర్. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు.ఈ నిజం దాచి అషిమాని పెళ్లి చేసుకొంటాడు. ఎవరూ దొరకనట్లు డాక్టర్ ఆంజనేయలు... విక్కీ వెనకే ఎందుకు పడతాడంటే.. సంతాన సాఫల్య కేంద్రం నడుపుతూ.. తన దగ్గరకు వచ్చిన క్లైంట్లకు న్యాయం చేయలేక, బోర్డు తిప్పేసే పరస్దితుల్లో ఉంటాడు. ఆయన ... ఓ మంచి వీర్యదాత కోసం వెదుకుతుంటాడు. తన చూపు విక్కీ పై పడుతుంది. విక్కీ తాత ముత్తాతలు ఒకొక్కరూ డజను మంది పిల్లలకు తండ్రులవ్వడమే అందుకు కారణం. ఆ బీజాలు తన ఆసుపత్రికి పనిచేస్తాయన్న ఉద్దేశంతో విక్కీ వెంట పడతాడు ఆంజనేయులు మొదట స్పెర్మ్ డోనర్ అనే పదాన్ని ముందు చిరాగ్గా చూసిన విక్కీ.. ఆతరవాత డబ్బులు కోసం, ఓకే అంటాడు . అలా.. ఆంజనేయులు సంతాన సాఫల్య కేంద్రం మంచి పేరు తెచ్చుకుని డవలప్ అవుతుంది. విక్కీ కూడా రెండు చేతులా సంపాదించేస్తుంటాడు. అప్పటినుంచీ తన ఖర్చులకు.. అవసరాలకు సరిపడినంత డబ్బు వస్తుండడంతో దానికి అలవాటు పడతాడు. అయితే ఓ సిట్యువేషన్ లో విక్కీ స్పెర్మ్ డోనర్ అనే నిజం అషిమాకు తెలిసిపోతుంది. ఆమె అతన్ని విడిచి వెళ్లిపోతుంది. కథలో పెద్ద మలుపు వస్తుంది. తను చేస్తున్న వృత్తి తన ఫ్యామిలీ లైఫ్ కు ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అప్పుడు ఏం జరిగింది? వీళ్లిద్దరి కథ ఏ మలుపు తిరిగింది? వీళ్ల వైవాహిక జీవితం ఏమైంది? ఈ విషయాలన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. మరో ప్రక్క విక్కీని పెళ్లి చేసుకున్న ఆషిమా కు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలతో.. తనకు పిల్లలు పుట్టరని అర్థమవుతుంది. ఈ నిజాలు తెలుసుకొన్న అషిమా ఇప్పుడేం నిర్ణయం తీసుకుంది? విక్కీని అర్థం చేసుకొందా, లేదా? అసలు వీళ్లిద్దరికి పిల్లలు పుట్టారా, లేదా?