X
తెలుగు » సినిమాలు » నరుడా డోనరుడా
నరుడా డోనరుడా

నరుడా డోనరుడా

Comedy | Romance | 04 Nov 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

నరుడా డోనరుడా స్టోరీ

నరుడా డోనరుడా సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ళ భరణి,  శ్రీల‌క్ష్మి, సుమ‌న్ శెట్టి, భ‌ద్ర‌మ్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ శేషు, సుంక‌ర‌ల‌క్ష్మి, పుష్ప‌, చ‌ల‌ప‌తిరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మల్లిక్ రామ్ నిర్వహించారు మరియు నిర్మాతలు వై.సుప్రియ‌, జాన్ సుధీర్ పూదోట కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శ్రీ చరణ్ స్వరాలు సమకుర్చరు.  కథ క్రికెటర్ విక్కీ (సుమంత్‌) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తన అవసరాల కోసం ఏదైనా చివరకు తన ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లను కూడా అమ్మేసే టైపు. అతని తల్లి (శ్రీలక్ష్మి) బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది.. నాయనమ్మలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. పనిలో పనిగా ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌) అనే బెంగాలీ అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. తాను కూడా కాదనటమెందుకు అని మెల్లమెల్లగా విక్కీతో ప్రేమలో పడిపోతుంది. అయితే తాను ఇది వరకే ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది. విక్కీ మాత్రం ఆషిమా దగ్గర ఓ నిజం దాస్తాడు. కానీ ఆషిమా దగ్గర దాచిన విషయం వింటే ఆమె ఒప్పుకోదని అనుమానం. ఇంతకీ విక్కీ దాచిన నిజం ఏమిటీ అంటే.. తనో స్పెర్మ్‌ డోనర్‌. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు.ఈ నిజం దాచి అషిమాని పెళ్లి చేసుకొంటాడు. ఎవరూ దొరకనట్లు డాక్టర్ ఆంజనేయలు... విక్కీ వెనకే ఎందుకు పడతాడంటే.. సంతాన సాఫ‌ల్య కేంద్రం న‌డుపుతూ.. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన క్లైంట్ల‌కు న్యాయం చేయ‌లేక‌, బోర్డు తిప్ప‌ేసే పరస్దితుల్లో ఉంటాడు. ఆయన ... ఓ మంచి వీర్య‌దాత కోసం వెదుకుతుంటాడు. త‌న చూపు విక్కీ పై ప‌డుతుంది. విక్కీ తాత ముత్తాత‌లు ఒకొక్క‌రూ డ‌జ‌ను మంది పిల్ల‌ల‌కు తండ్రుల‌వ్వ‌డ‌మే అందుకు కార‌ణం. ఆ బీజాలు త‌న ఆసుప‌త్రికి ప‌నిచేస్తాయ‌న్న ఉద్దేశంతో విక్కీ వెంట ప‌డ‌తాడు ఆంజ‌నేయులు మొదట స్పెర్మ్ డోన‌ర్ అనే ప‌దాన్ని ముందు చిరాగ్గా చూసిన విక్కీ.. ఆత‌ర‌వాత డబ్బులు కోసం, ఓకే అంటాడు . అలా.. ఆంజ‌నేయులు సంతాన సాఫ‌ల్య కేంద్రం మంచి పేరు తెచ్చుకుని డవలప్ అవుతుంది. విక్కీ కూడా రెండు చేతులా సంపాదించేస్తుంటాడు. అప్పటినుంచీ తన ఖర్చులకు.. అవసరాలకు సరిపడినంత డబ్బు వస్తుండడంతో దానికి అలవాటు పడతాడు. అయితే ఓ సిట్యువేషన్ లో విక్కీ స్పెర్మ్ డోనర్ అనే నిజం అషిమాకు తెలిసిపోతుంది. ఆమె అతన్ని విడిచి వెళ్లిపోతుంది. కథలో పెద్ద మలుపు వస్తుంది. తను చేస్తున్న వృత్తి తన ఫ్యామిలీ లైఫ్ కు ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అప్పుడు ఏం జరిగింది? వీళ్లిద్దరి కథ ఏ మలుపు తిరిగింది? వీళ్ల వైవాహిక జీవితం ఏమైంది? ఈ విషయాలన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే. మరో ప్రక్క విక్కీని పెళ్లి చేసుకున్న ఆషిమా కు కొన్ని ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో.. త‌న‌కు పిల్లలు పుట్ట‌ర‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ నిజాలు తెలుసుకొన్న అషిమా ఇప్పుడేం నిర్ణయం తీసుకుంది? విక్కీని అర్థం చేసుకొందా, లేదా? అస‌లు వీళ్లిద్ద‌రికి పిల్లలు పుట్టారా, లేదా?
Read More

నరుడా డోనరుడా కాస్ట్ & క్రూ

నరుడా డోనరుడా సిబ్బంది సమాచారం

దర్శకత్వం మల్లిక్ రామ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మల్లిక్ రామ్
నిర్మాత సుప్రియ వై, జాన్ సుధీర్ పూదోట
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నరుడా డోనరుడా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొన్ని కాన్సెప్టులు వినటానికి విచిత్రంగా ఉంటాయి. అరే ఇలాంటి కథలు కూడా సినిమాలు చేస్తారా అనే డౌట్ వస్తుంది. అయితే ఆ విచిత్రంగా అనుకున్న కథలే ఒక్కోసారి హై సక్సెస్ ని తెచ్చిపెడతాయి. అదే బాలీవుడ్ లో జరిగింది. తెలుగు కు వచ్చేసరికి మరి ఆ స్దాయి సక్సెస్ వస్తుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు వేరు. వీరికి మరికాస్త సున్నితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి విక్కీ డోనర్ చిత్రం ఎక్కువగా ఆడింది మల్టిఫ్లెక్స్ లలో . ఓ స్దాయి ఆడియన్స్ కు అది నచ్చింది, హిట్ చేసి వదిలారు. అదే తెలుగుకు వచ్చేసరికి ఇక్కడ కూడా అదే స్దాయి ప్రేక్షకులకు అర్దం చేసుకునే కథ. అయితే ఇక్కడ మల్టిఫ్లెక్స్ లలో ఇలాంటి సినిమాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్లు ఆల్రెడీ హిందీలో చూసేసారు. సినిమాలో కీలకమైన ఎమోషన్ హీరో హీరోయిన్లు విడిపోయే సీన్ లో వస్తుంది. అయితే దాన్ని ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా చెప్పాల్సింది అనిపించటం ఖాయం. అప్పుడే సెకండాఫ్ లో పండే డ్రామాకి ఇంకాస్త బాగా కనెక్ట్ అయ్యేది. ఫస్టాఫ్ మొత్తం తొలిభాగం కేవ‌లం స్పెర్మ్ డొనేష‌న్‌పై.. సెకండాఫ్ మొత్తం భార్యా భ‌ర్త‌లు విడిపోవ‌డం, కలవటం పై సాగుతాయి. కాబ‌ట్టి చూసిన సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది చాలా చోట్ల. బాలీవుడ్‌ చిత్రాన్నీ.. అందులో పాత్రల్నీ మక్కీకి మక్కీ దించే ప్రయత్నం జరిగటంతో... ‘విక్కీ డోనర్‌' చూసిన వాళ్లకు ఈ సినిమా కాపీ పేస్ట్‌లానే ఉంటుంది. అయితే హిందీలో చూడని తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ కథా నేపథ్యం కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తూంటే లెంగ్త్ ఎక్కువైందనిపిస్తుంది. మ‌రో 20 నిమిషాల్ని ట్రిమ్ చేస్తే...విషయం మరింత బాగా కనెక్టు అవుతుంది. అలాగే పెళ్లి చూపుల సీన్‌లో య‌మ‌హా న‌గ‌రి.. అంటూ హీరో పాట అందుకోవ‌డం.. వంటి కొన్ని స‌న్నివేశాలు మ‌రీ లెంగ్తీగా ఉండ‌డం విసుగు తెప్పిస్తాయి. ముఖ్యంగా పిల్లలు లేని తల్లుల ఆవేదనను పోట్రెయిట్ చేసి ఉంటే సినిమాకు డెప్త్ వచ్చేది. అయితే క్లైమాక్స్ సీన్స్ డీల్‌ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది.

నరుడా డోనరుడా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నరుడా డోనరుడా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+