నీజతగా నేనుండాలి సినిమా హిందీ ఆషికీ-2 కి అనువాదం ఇది ఒక రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సచిన్ జోషి, నాజియా హుసేన్, రావు రమేష్, శషాంక్, పోసాని క్రిష్ణ మురళి, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జయ రవిచంద్ర నిర్వహించారు మరియు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అంకిత్ తివారి స్వరాలు సమకుర్చారు.
కథ
తాగుడుకి బానిసై తన పేరంతా పోగొట్టుకున్న యువ గాయకుడు రాఘవ్ జైరాం(సచిన్ జోషి). ఆ పరిస్ధితుల్లో అతని జీవితంలోకి గాయిత్రీ నందన(నజియా) ప్రవేశిస్తుంది. ఆమె పాడిన విని పరవసించిన రాఘవ్..ఆమెను పెద్ద గాయని చేస్తానని మాట ఇస్తాడు. మాట నిలబెట్టుకునేందుకు పెద్ద కంపెనీలలో అవకాసాలు ఇప్పిస్తాడు. దాంతో ఆమె కూడా టాప్ సింగర్ గా ఎదుగుతుంది...దాంతో పాటే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించి పెరుగుతుంది. కానీ రాఘవ్ మాత్రం ప్రేమకైనా దూరం అవుతాను కానీ త్రాగుడు మానలేను అన్నట్లు ఉంటాడు. దాంతో గాయిత్రి తన కెరీర్ ని ప్రక్కన పెట్టి తనకు లైఫ్ ఇచ్చిన రాఘవ్ ని మామూలు మనిషిని చేయటానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.. అప్పుడు రాఘవ్ ఏం చేసాడు.. వారి ప్రేమ కథ ఏమైంది అన్నది మిగతా కథ.