నీవెవరో (2018)(U/A)
Release date
24 Aug 2018
genre
నీవెవరో స్టోరి
నీవెవరో సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితిక సింగ్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరినాథ్ వహించారు మరియు నిర్మాతలు ఎమ్ వి వి సత్యనారాయణ, కోన వెంకట్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి అందించారు.
కథ
పుట్టుకతోనే అంధుడైన కల్యాణ్ (ఆది పినిశెట్టి) ఓ రెస్టారెంట్ యజమాని. ఆదిని బాల్య స్నేహితురాలు (రితిక సింగ్) చాలా ఇష్టంగా ప్రేమిస్తుంది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకొంటున్న సమయంలో వెన్నెల (తాప్సీ పన్ను)తో ఆది ప్రేమలో పడుతాడు. కష్టాల్లో ఉన్న వెన్నెలను ఆదుకొనే క్రమంలో జరిగిన యాక్సిడెంట్లో ఆదికి కనుచూపు వస్తుంది. కానీ కనిపించకుండా పోయిన వెన్నెల కోసం వెతికే సమయంలో రితికతో నిశ్చితార్థం కూడా ఆగిపోతుంది. ఈ క్రమంలో వెన్నెల గురించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. వెన్నెల గురించి తెలిసిన ఆ నిజం ఏమిటి? వెన్నెల మారు పేర్లతో అంధులను ఎందుకు మోసగిస్తుంది? తనకు జరిగిన మోసానికి వెన్నెలకు కల్యాణ్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకొన్నాడా? చివరకు వెన్నెల ఏమైంది? ఈ కథలో కానిస్టేబుల్ చోక్కారావు (వెన్నెల కిషోర్), హ్యాకర్ జైహింద్ జగన్నాథం (సప్తగిరి) పాత్రలేమిటి అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నీవెవరో చిత్ర కథ.
**Note:Hey! Would you like to share the story of the movie నీవెవరో with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు