X
Home టాప్ లిస్టింగ్

సరికొత్త చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు

Author Administrator | Updated: Thursday, March 16, 2023, 08:39 AM [IST]

ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. నాటు నాటు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం అయిన ఆస్కార్ మన తెలుగు సినీ పాటకు తలొంచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది.


cover image
చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు’
1

'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' ఉత్తమ పాట విభాగంలో 'నాటు నాటు'కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది. ఆ ఉత్సాహంతోనే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వివిధ కేటగిరిల్లో ఆస్కార్‌ అవార్డులకు పోటీ పడగా, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు కు ఆస్కార్‌ నామినేషన్స్‌ తుది జాబితాలో చోటు దక్కించుకుంది. భాషతో సంబంధం లేకుండా  నాటు నాటు పాట ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన సాంగ్స్
2

బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్‌’ టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌, ‘లిఫ్ట్‌ మి అప్‌’ బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌, దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ టాప్‌గన్‌ మావెరిక్‌ పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు’(RRR)కు ఆస్కార్‌ దక్కించుకుంది.

3

ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు. ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా 'నాటు నాటు...' పాటకు అభిమాని. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పడంతో 'దేవుడికి నాటు నాటు నచ్చింది' 

4

ఆస్కార్ కంటే ముందు 'నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చింది. ఆ సమయంలోనే ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అందరికీ అర్థమైంది. ఈ అవార్డు ద్వారా దేశానికి రాజమౌళి గొప్ప గౌరవం తెచ్చారు. 'నాటు నాటు...'కు ఆస్కార్ రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అన్ని అవార్డులు ఒక ఎత్తు అయితే ఆస్కార్ అవార్డు మరో ఎత్తు. దీంతో యావత్ దేశం సంబరాల్లో మునిగింది. 

5

ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన 'జయహో' పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే, అది ఇండియన్ సినిమాఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన 'జయహో' పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే, అది ఇండియన్ సినిమాలో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా 'స్లమ్ డాగ్ మిలినియర్'లోది.లో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా 'స్లమ్ డాగ్ మిలినియర్'లోది.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+