ఒక్క మగాడు సినిమా యాక్షన్ రోమ్యంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, నిషా కొఠారి, అనుష్క, సిమ్రన్, అశుతోష్ రాణా, కోట శ్రీనివాసరావు, కృష్ణభగవాన్, రఘుబాబు, చలపతిరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు: వైవిఎస్ చౌదరి నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
అది వెంకటాపురం గ్రామం. వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ అలియాస్ రాము ( బాలకృష్ణ) ఆ గ్రామస్ధులకు అచ్చంగా దేవుడు. ఆయనను దేవాది దేవుడిగా వారు పరిగణిస్తారు. కానీ బాలకృష్ణ మాత్రం వారికి తాను మామూలు మనిషినని చెబుతూ ఉంటాడు. కానీ ఆయన వారికి ఆపద్బాంధవుడు. ప్రభుత్వ యంత్రాంగానికి హీరో గారంటే హడల్. ఒకరోజు హీరో గారు ఒక ప్రేమ జంటకు పెళ్ళి చేస్తాడు. పెళ్ళి కొడుకు చాలా గొప్ప కుటుంబానికి చెందినవాడు. ఆయన తండ్రి సాక్షాత్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి (అశుతోష్ రాణా) అదే సమయంలో "భారతీయుడు" వంటి వృద్ధుడు అవినీతిపరుల మీద విరుచుకుపడి అంతం చేస్తూ ఉంటాడు. రాము (బాలకృష్ణ)కు , ఆ వృద్ధుడికి ఉన్న పోలికలను పోలీసులు గుర్తిస్తారు. ఆ వృద్ధుడిని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తారు. అతను యువ బాలకృష్ణ కాదని, వృద్ధ బాలకృష్ణ అని, ఆయన బ్రిటీష్ పాలకుల మీద పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడని తెలుసుకుంటారు. దీనితో ముఖ్యమంత్రికి, వృద్ధ బాలకృష్ణకు మధ్య సంఘర్షణ ప్రారంభమౌతుంది. ఈ సంఘర్శణల నుంచి ఎలా బయట పడతాడు అనేదె కథ.