ఆపరేషన్ 2019 సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్,దిక్ష పంత్, మంచు మనోజ్ కుమార్, సునీల్, హరి తేజ, నాగినీడు, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కరణమ్ బాబ్జి మరియు నిర్మాత అలివేలు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రాప్ రాక్ షకీల్ సమకుర్చరు.
కథ
ఎన్నారై ఉమాశంకర్ (శ్రీకాంత్) సొంత రాష్ట్రం, గ్రామం అంటే చాలా ఇష్టం. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే మంచి మనిషి. రైతులు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని కోటి రూపాయల చెక్ పంపిస్తాడు. కానీ సహాయం అందకరైతులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతారు. ఓ రాజకీయ నేత డబ్బును దుర్వినియోగం చేసిన రాజకీయ నేతను నిలదీస్తాడు. ఆ వ్యవహారంలోనే ఓ కారణం వల్ల ఉమాశంకర్ జైలుకు వెళ్తాడు?
ఉమాశంకర్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. జైలు నుంచే ఎమ్మెల్యే పదవికి ఎందుకు పోటీ చేశాడు? ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాశంకర్ అవినీతి పరుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? భ్రష్టు పట్టిన రాజకీయాలను ఎలా ప్రక్షాళన చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఆపరేషన్ 2019 సినిమా కథ.