పచ్చీస్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్జ్ , శ్వేతా వర్మ, రవివర్మ, దయానంద్ రెడ్డి, సుభలేఖ సుధాకర్, విశ్వేందర్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ కృష్ణ & రామ్ సాయి వహించారు. నిర్మాతలు కౌశిక్ కుమార్ రామ్ సాయి కలిసి నిర్మించారు. సంగీతం స్మరన్ సాయి అందించారు.
కథ
ఈజీ మనీ అనే అంశం చుట్టూనే ఈ సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులైన బసవరాజు(కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి)- గంగాధర్(శుభలేఖ సుధాకర్) మధ్య ఆధిపత్య పోరును ఆసరాగా చేసుకుని అభిరామ్(రామ్స్) అనే జులాయిగా తిరిగే కుర్రవాడు ఎలా తన పబ్బం గడుపు డానికి ప్రయత్నించి చివరికి, బాధ్యత కలిగిన మనిషిగా మారాడు అనే లైన్ తో సినిమా రూపొందించారు. బాధ్యతలు లేకుండా జులాయిగా తిరిగే అభిరామ్ బెట్టింగ్ ఆడి ఓడిపోవడంతో పాతిక లక్షలు కట్టాల్సి వస్తుంది. ఆ పాతిక లక్షల కోసం బసవరాజు - గంగాధర్ మధ్య జరుగుతున్న వార్ లోకి ఎంటర్ అయి ఎలా బయటపడ్డాడు ? ఆ పాతిక లక్షలు కట్టాడా లేదా ? మధ్యలో అవంతిక(శ్వేత వర్మ) పాత్ర ఏమిటి అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.