పడి పడి లేచే మనసు (2018)(U)
Release date
21 Dec 2018
genre
పడి పడి లేచే మనసు స్టోరి
పడి పడి లేచే మనసు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి వహిస్తున్నారు మరియు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ సమకూర్చుతున్నారు.
కథ
ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా సరదాగా కాలం గడిపే పుట్‌బాల్ ప్లేయర్ సూర్య (శర్వానంద్) తొలిచూపులోనే వైశాలి( సాయిపల్లవి)తో ప్రేమలో పడుతాడు. వైశాలిని తన ప్రేమను అంగీకరింపజేయడానికి నానా రకాలు ప్రయత్నించి చివరకు సక్సెస్ అవుతాడు? వారిద్దరూ వీడదీయలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు? చివరి నిమిషంలో ఓ బలమైన కారణంగా ప్రేమకు పెళ్లి అడ్డంకి అనే పాయింట్‌తో వైశాలితో ప్రేమకు నిరాకరిస్తాడు. దాంతో నేపాల్‌లో వారి లవ్ బ్రేకప్ అవుతుంది? కానీ ఏడాది తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకొనే ఫీలింగ్ కలిగితే వారిద్దరూ అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకొంటారు. కానీ వారిద్దరూ కలువడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భారీ ప్రమాదం జరుగుతుంది?
భారీ ప్రమాదం తర్వాత సూర్య, వైశాలి కలుసుకొన్నారా? వారిద్దరి మధ్య మళ్లీ ఎలాంటి అంశాలు చోటుచేసుకొన్నాయి. తనను కలిసిన సూర్యను వైశాలి ఎందుకు దూరం పెట్టింది? తన బావ (సునీల్)తో తల్లిదండ్రులు పెళ్లి చేయాలన్న వైశాలి తల్లిదండ్రులు ప్రయత్నం ఫలించిందా? సూర్య తల్లిదండ్రులు (ప్రియా రామన్, సంపత్ రాజ్) విడిపోవడానికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వైశాలితో ప్రేమపై ఎలాంటి ప్రభావం పడింది. విడిపోయిన సూర్య తల్లిదండ్రులు మళ్లీ కలుసుకొన్నారా? ఇలాంటి ట్విస్టుల మధ్య సూర్య, వైశాలి కథకు ఎలాంటి ముగింపు దొరికిందనే ప్రశ్నలకు సమాధానమే ‘పడి పడి లేచే మనసు' సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie పడి పడి లేచే మనసు with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు