X
తెలుగు » సినిమాలు » పడి పడి లేచే మనసు
పడి పడి లేచే మనసు

పడి పడి లేచే మనసు

Romance | 21 Dec 2018 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

పడి పడి లేచే మనసు స్టోరీ

పడి పడి లేచే మనసు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి వహిస్తున్నారు మరియు శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ సమకూర్చుతున్నారు.  కథ ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా సరదాగా కాలం గడిపే పుట్‌బాల్ ప్లేయర్ సూర్య (శర్వానంద్) తొలిచూపులోనే వైశాలి( సాయిపల్లవి)తో ప్రేమలో పడుతాడు. వైశాలిని తన ప్రేమను అంగీకరింపజేయడానికి నానా రకాలు ప్రయత్నించి చివరకు సక్సెస్ అవుతాడు? వారిద్దరూ వీడదీయలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు? చివరి నిమిషంలో ఓ బలమైన కారణంగా ప్రేమకు పెళ్లి అడ్డంకి అనే పాయింట్‌తో వైశాలితో ప్రేమకు నిరాకరిస్తాడు. దాంతో నేపాల్‌లో వారి లవ్ బ్రేకప్ అవుతుంది? కానీ ఏడాది తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకొనే ఫీలింగ్ కలిగితే వారిద్దరూ అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకొంటారు. కానీ వారిద్దరూ కలువడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భారీ ప్రమాదం జరుగుతుంది? భారీ ప్రమాదం తర్వాత సూర్య, వైశాలి కలుసుకొన్నారా? వారిద్దరి మధ్య మళ్లీ ఎలాంటి అంశాలు చోటుచేసుకొన్నాయి. తనను కలిసిన సూర్యను వైశాలి ఎందుకు దూరం పెట్టింది? తన బావ (సునీల్)తో తల్లిదండ్రులు పెళ్లి చేయాలన్న వైశాలి తల్లిదండ్రులు ప్రయత్నం ఫలించిందా? సూర్య తల్లిదండ్రులు (ప్రియా రామన్, సంపత్ రాజ్) విడిపోవడానికి కారణం ఏమిటి? తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం వైశాలితో ప్రేమపై ఎలాంటి ప్రభావం పడింది. విడిపోయిన సూర్య తల్లిదండ్రులు మళ్లీ కలుసుకొన్నారా? ఇలాంటి ట్విస్టుల మధ్య సూర్య, వైశాలి కథకు ఎలాంటి ముగింపు దొరికిందనే ప్రశ్నలకు సమాధానమే ‘పడి పడి లేచే మనసు' సినిమా కథ.
Read More

పడి పడి లేచే మనసు కాస్ట్ & క్రూ

పడి పడి లేచే మనసు సిబ్బంది సమాచారం

దర్శకత్వం హను రాఘవపూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విశాల్ చంద్రశేఖర్
నిర్మాత సుధాకర్ చెరుకూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పడి పడి లేచే మనసు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
యూత్‌కు, ఫ్యామిలికి నచ్చే అంశాలతో రూపొందిన చిత్రం పడిపడి లేచె మనసు. కానీ సంపూర్ణంగా తెరపైన వండి వార్చడంలో దర్శకుడి తడబాటు కనిపిస్తుంది. సినిమా సగటు ప్రేక్షకుడికి చేరకపోతే హను రాఘవపూడి ఇంటెలెక్చువాలిటే ప్రధాన కారణం అవుతుంది. వీకెండ్‌లో, ఫెస్టివల్ హాలిడేస్‌ ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం. ఏ సెంటర్లు, మల్లిప్లెక్స్ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన ఉండొచ్చు. బీ,సీ సెంటర్లలో జెండా ఎగురవేస్తే ఈ సినిమా హిట్ రేంజ్‌ను అంచనా వేయడం కష్టమే అని చెప్పవచ్చు.

పడి పడి లేచే మనసు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పడి పడి లేచే మనసు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+