పరమవీర చక్ర సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, రాజ్ ప్రేమి, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్, విజయ్ కుమార్, చలపతిరావు, అశోక్ కుమార్, బ్రహ్మానందం, అలీ, హేమ, రఘుబాబు, కృష్ణభగవాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు మరియు నిర్మాత సి కల్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.
కథ
ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్టార్ హీరో చక్రధర్(బాలకృష్ణ). అతన్ని అభిమానిస్తూ వెంటబడే (షీలా) అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. అయితే అతని తల్లి(జయసుధ)కి అలాంటివి గిట్టవు. ఆవిడకి తన కొడుకు పెద్ద మిలిట్రీ మేజర్ అయ్యి, దేశానికి సేవ చేయాలనే జీవితాశయం. ఈ స్ధితిలో చక్రధర్ కు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ పరిచయమై తమ దగ్గరో అధ్బుతమైన కథ ఉందని చెప్తారు. కథ నచ్చితే ప్రీగా చేస్తానని మాట ఇచ్చిన చక్రధర్ కి ఆ కథని జితేంద్ర(మురళి మోహన్)అనే మిలిట్రీ ఆఫీసర్ నోటిగుండా వినటానకి రెడీ అవుతాడు. ఆ కథ ఆర్మీలో సిన్సియర్ ఆఫీసర్ మేజర్ జయసింహ(బాలకృష్ణ)కి చెందింది. కథ వింటున్న చక్రధర్ అందులో లీనమై తనను తాను జయసింహాగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే ఆ కథ జరిగిందని తెలుసుకుంటాడు. విన్న ఆ కథ ప్రకారం కొందరు కుట్రదారులు (సినిమా ఈ రేంజి పాత వాసనలుతో ఉంటుంది) వల్ల నష్టపోయి, దేశద్రోహిగా మిగిలిన జయసింహకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకోసం సినిమా నటుడు, జయసింహ పోలికలతో ఉన్న చక్రధర్ ఏం చేసాడు. ఈ కథకీ పరమవీరచక్ర బిరుదుకీ సంభందం ఏమిటీ అన్నది మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.