X
తెలుగు » సినిమాలు » పరమవీర చక్ర
పరమవీర చక్ర

పరమవీర చక్ర

Action | Drama | 12 Jan 2011 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పరమవీర చక్ర స్టోరీ

పరమవీర చక్ర సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, అమీషా పటేల్‌, షీలా, నేహా ధూపియా , రాజ్‌ ప్రేమి, కోట శ్రీనివాసరావు, మురళీ మోహన్‌, విజయ్‌ కుమార్‌, చలపతిరావు, అశోక్ ‌కుమార్‌, బ్రహ్మానందం, అలీ, హేమ, రఘుబాబు, కృష్ణభగవాన్‌ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు మరియు నిర్మాత సి కల్యాణ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు. కథ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే స్టార్ హీరో చక్రధర్(బాలకృష్ణ). అతన్ని అభిమానిస్తూ వెంటబడే (షీలా) అతనికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూంటుంది. అయితే అతని తల్లి(జయసుధ)కి అలాంటివి గిట్టవు. ఆవిడకి తన కొడుకు పెద్ద మిలిట్రీ మేజర్ అయ్యి, దేశానికి సేవ చేయాలనే జీవితాశయం. ఈ స్ధితిలో చక్రధర్ కు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ పరిచయమై తమ దగ్గరో అధ్బుతమైన కథ ఉందని చెప్తారు. కథ నచ్చితే ప్రీగా చేస్తానని మాట ఇచ్చిన చక్రధర్ కి ఆ కథని జితేంద్ర(మురళి మోహన్)అనే మిలిట్రీ ఆఫీసర్ నోటిగుండా వినటానకి రెడీ అవుతాడు. ఆ కథ ఆర్మీలో సిన్సియర్ ఆఫీసర్ మేజర్ జయసింహ(బాలకృష్ణ)కి చెందింది. కథ వింటున్న చక్రధర్ అందులో లీనమై తనను తాను జయసింహాగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే ఆ కథ జరిగిందని తెలుసుకుంటాడు. విన్న ఆ కథ ప్రకారం కొందరు కుట్రదారులు (సినిమా ఈ రేంజి పాత వాసనలుతో ఉంటుంది) వల్ల నష్టపోయి, దేశద్రోహిగా మిగిలిన జయసింహకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకోసం సినిమా నటుడు, జయసింహ పోలికలతో ఉన్న చక్రధర్ ఏం చేసాడు. ఈ కథకీ పరమవీరచక్ర బిరుదుకీ సంభందం ఏమిటీ అన్నది మిగతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

పరమవీర చక్ర కాస్ట్ & క్రూ

పరమవీర చక్ర సిబ్బంది సమాచారం

దర్శకత్వం దాసరి నారాయణరావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత సి కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పరమవీర చక్ర విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పైనల్ గా ఈ చిత్రం బాలకృష్ణకు ఎలాంటి దర్శకులను, కథలను ఎంచుకోవాలి అన్న విషయంలో స్ఫష్టమైన ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సింహాతో పోల్చుకుంటే ఈ చిత్రం ఎక్కడ దెబ్బతిందో ఇట్టే కనిపెట్టేయచ్చు. అలాగే అదే సమయంలో దాసరిగారు ఇంత దారుణమైన ప్లాపులు ఇవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం కొంతకాలం పాటు దర్శకత్వానికి దూరంగా ఉండటమే బెస్ట్ అని ఈ చిత్రం చెప్తుంది. ఇక మనలాంటివారికి సింహా లాంటి హిట్ తర్వాత వచ్చే ప్రతీ చిత్రం సింహా కానక్కర్లేదని, ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని నిరూపిస్తుంది.

పరమవీర చక్ర సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పరమవీర చక్ర

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+