పరాన్నజీవి సినిమా సెటైర్, పొలిటికల్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో షకలక శంకర్, మహేష్ కత్తి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నూతన నాయుడు వహించారు. 99 థియేటర్ బ్యానర్‌పై స్కై మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి సీఎస్ నిర్మాత.
కథ
నా ఇష్టం, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే విధంగా అహభావంలో ఉండే డైరెక్టర్ రాధా గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి (షకలక శంకర్). వేషాలు ఎర వేసి వాళ్లను వాడుకొంటూ అన్యాయం చేస్తున్న వర్మకు ఓ ఔత్సాహిక యువతి భంగపాటుకు గురవుతుంది. అలాగే వర్మతో సినిమా తీయాలనే ఎప్పటి నుంచో ఎదురుచూసే నిర్మాత శేఖర్ (మహేష్ కత్తి)కి ఆర్జీవి షాకిస్తాడు. తాను ఊహించుకొన్న ఆర్జీవికి ఎదురుగా ఉండే వ్యక్తి నిజస్వరూపం చూసి దిగ్బ్రాంతికి గురవుతాడు. ఆర్జీవి చేసిన నమ్మక మోసానికి గురైన హీరోయిన్ ఏం చేసింది? ఎలా పగతీర్చుకొన్నది? ఆర్జీవి నుంచి ఊహించిన ప్రవర్తనను చూసిన నిర్మాత శేఖర్ ఆయనకు ఎలా బుద్ది చెప్పారు? తన అసిస్టెంట్‌గా పనిచేసిన వ్యక్తి (లక్ష్మణ్ మీసాల) తన బాస్‌కు ఎలాంటి గుణపాఠం చెప్పారు. అలాగే గత చిత్రాలు రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి చిత్రాల్లోని పాత్రలు కూడా ఆర్జీవికి ఎలా బుద్ది చెప్పారనే అనే ప్రశ్నలకు సమాధానమే పరాన్నజీవి కథ.