పరేషాన్ మూవీ కామెడీ ఎంటరైనర్ చిత్రం ఇందులో తిరువీర్, పావని కరణం, బన్నీ అభిరామ్, సాయి ప్రసన్న, మురళీధర్ గౌడ్, శృతి రియాన్, అర్జున్ కృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రూపక్ రొనాల్డ్‌సన్ వహించారు. నిర్మాత సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. సంగీతం యస్వంత్ నాగ్ అందించారు.
ట్రైలర్
తిరువీర్ తండ్రి పరీక్షలలో అతని మార్కుల గురించి ఉపన్యాసం ఇవ్వడంతో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లి విపరీతంగా తిట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. "ఓ ఉద్యోగం లేదు సదువు సంకనాకిస్తివి ఏ పనీ శాత కాద"ని వాళ్ల అమ్మ చెప్పే డైలాగ్స్ తిరువీర్ క్యారెక్టర్ ను ప్రస్ఫుటం చేస్తున్నాయి. దాంతో పాటు "ఏంది సత్తీ గిది.. నేను లిప్ లాసమ్ పట్కరమ్మన్న.. లిప్ లాసమ్ అంటే గిట్ల మూతికి పెట్టుకోంగనే చెక్కుమని మెరవాలే.. నాలెక్క. గిది సూడు పెదువులు పలిగితే పెట్టుకునే దానిలాగా ఉంది. నువ్వే పెట్టుకో నీ బర్రె మూతికి" అని అమ్మాయి చెప్పే డైలాగ్ మరింత అలరిస్తోంది. ఆ తర్వాత తిరువీర్ తో పాటు అతని స్నేహితుల లవ్ స్టోరీని చూపిస్తూ వచ్చే సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అచ్చం పల్లెటూరి భాషలో రాబోతున్న ఈ కామెడీ సినిమా.

రిలీజ్
జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.