twitter

    పెంగ్విన్ స్టోరి

    పెంగ్విన్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కీర్తీ సురేష్, మాస్టర్ అద్వైత్, లింగా, రఘు, నిత్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఈశ్వర్ కార్తీక్ వహించారు. నిర్మాతలు కార్తీక్ సుబ్బరాజ్, సంతానం, సుధన్ సుందరం నిర్మించారు. సంగీతం సంతోష్ నారాయణ్ అందించారు. సినిమాటోగ్రఫి కార్తీక్ పళని, ఎడిటింగ్ అనిల్ క్రిష్

    కథ 

    అజయ్ (మాస్టర్ అద్వైత్) అనే బిడ్డకు తల్లి అయిన రిథమ్ (కీర్తీ సురేష్) రెండో బిడ్డకు జన్మనివ్వడానికి గర్బం దాల్చుతుంది. ఆ క్రమంలో అజయ్‌ను చార్లిచాప్లిన్ వేషంలో వచ్చిన ఓ వ్యక్తి ఎత్తుకెళ్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అజయ్‌ తిరిగి వస్తాడు. కానీ అజయ్‌కు అపాయం తలపెట్టేందుకు చాప్లిన్ వేషధారి వెంటాడుతుంటాడు. తన బిడ్డ అజయ్‌ను ఎవరు, ఎందుకు వెంటాడుతున్నారనే విషయంపై రిథమ్ దృష్టిపెడుతుంది. ఆ చాప్లిన్ మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే తెలుసుకోవడానికి ప్రాణాలకు తెగిస్తుంది. ఆ పరిస్థితుల్లో డాక్టర్ డేవిడ్ (మాథి) లాంటి వ్యక్తిని అనుమానిస్తుంది. ఇంతకు అజయ్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? అజయ్‌ను ఎందుకు ఎత్తుకెళ్లారు? అజయ్‌ను ఎత్తుకెళ్లడం ద్వారా రిథమ్‌ను మానసికంగా ఎందుకు వేధించాలనుకొన్నారు? రిథమ్‌పై చాప్లిన్ మాస్క్ ధరించిన వ్యక్తి ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు. చాప్లిన్ మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? డాక్టర్ డేవిడ్ ఎందుకు కిడ్నాప్ చేస్తుంటాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే పెంగ్విన్ కథ.

    **Note:Hey! Would you like to share the story of the movie పెంగ్విన్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X