twitter

    పిట్టగోడ స్టోరి

    పిట్టగోడ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనుదీప్ కెవి నిర్వహించారు మరియు రామ్మోహన్ పి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కమలకర్ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    గోదావరి ఖనిలో పనీ పాటా లేకుండా తిరిగే ..టిప్పు, బిల్డప్‌ వేణు, జ్ఞానేశ్వర్‌, నాగరాజు చుట్టూ ఈ కథ తిరిగుతుంది. బేవార్స్ గా తిరిగే ఈ బ్యాచ్ అంటే అక్కడ ఎవరికీ గౌరవం ఉండదు. వాళ్ల వాళ్ల ఇళ్లల్లోనూ విలువ ఉండదు. వీళ్లు ఎప్పుడూ దగ్గర్లోని ఓ ‘పిట్టగోడ' ఎక్కి కబుర్లు చెప్పుకొంటుంటారు. వీళ్లకు ఆ గోడే ప్రపంచం. తమలోకంలో తాము బతుకుతుంటారు. ఎప్పుడూ అందరితోటీ తిట్లు తినే ఈ పిట్టగోడ బ్యాచ్ కు టిప్పు (విశ్వదేవ్) లీడర్ గా ఉంటాడు. ఓ రోజు వాళ్లలోనూ మార్పు వస్తుంది. తమని తాము నిరూపించుకోవాలనీ, వూళ్లొ అందరి ముందూ కాలరెత్తుకొని తిరగాలనీ అనుకొంటారు. పేపర్లో పేరు, ఫొటో చూసుకోడం కోసం ఏమైనా చేయాలి అని నిర్ణయంచుకుంటారు. ఎలాగైనా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈ పిట్టగోడ బ్యాచ్ తమ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును కండక్ట్ చేయాలనుకుని పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజులు వసూలు చేసి అన్ని ఏర్పాట్లను చేసుకుంటారు. టిప్పు... దివ్య (పునర్నవి) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ కథే... అందరి జీవితాల్నీ ఓ కొత్త దారిలోకి మళ్లిస్తుంది. టోర్నమెంట్ కు ముందు రోజు రాత్రి టిప్పు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. దాంతో టిప్పు, అతని ముగ్గురు స్నేహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. అసలు టిప్పు తీసుకున్న ఆ డెశిషన్ ఏమిటి ? ఎందుకు తీసుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ.. 
    **Note:Hey! Would you like to share the story of the movie పిట్టగోడ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X