పిజ్జా సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్, నరేన్, పూజా, జైకుమార్, వీరసేతురామన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ సుబ్బారాజ్ నిర్వహించారు మరియు నిర్మాత సురేష్ కోండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చారు.
కథ
మైఖేల్(విజయ్ సేతుపతి) పిజ్జా డెలివరీ బాయ్. తన గర్ల్ ఫ్రెండ్ అను(రమ్య నంబీసన్)తో కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుంటాడు. అనుకి దెయ్యాలపై నమ్మకం ఎక్కువ. దయ్యాలపై నవల రాసేందుకు అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ మైఖేల్‌కి ఇలాంటి వాటిపై పెద్దగా నమ్మకం ఉండదు. ఈ క్రమంలో పిజ్జా రెస్టారెంట్ ఓనర్ షన్ముగం(నరేన్)కూతురుకి దెయ్యం పడుతుంది. అప్పటి నుంచి అతనిలో దెయ్యాలంటే భయం మొదలవుతుంది. ఓ సారి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లిన మైఖేల్ భయానక పరిస్థితులు ఎదుర్కొంటాడు. అదే సమయంలో అను మిస్సవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లింగ్ అనుభూతినిస్తాయి.