X
Home టాప్ లిస్టింగ్

జనవరి 2022 ఓటిటి లో స్ట్రీమింగ్ అవ్వబోతున్న సినిమాలు

Author Administrator | Published: Wednesday, January 12, 2022, 11:23 AM [IST]

కరోనా తర్వాత ఓటిటి వేదికలకు గిరాకీ పెరిగింది. కోవిద్ కారణంగా థియేటర్స్ మూసి వేయడం తో అందరు ఓటిటి మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి నుండి ఓటిటి మార్కెట్ భారీగా పెరిగి పోతుంది. కరోనా నేపథ్యంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లో విడుదల అవుతుండగా మరికొన్ని సినిమాలు థియేటర్ లలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఓటిటి ప్లాట్ ఫామ్ లలో విడుదల అవుతున్నాయి. సంక్రాంతి వీకెండ్ మరియు జనవరి అంతా కొత్త సినిమాలతో నిండిపోనుంది. మరి జనవరి లో ఓటిటి వేదికగా విడుదల కాబోయే ఆ సినిమాలేంటో చూద్దాం..


cover image
పెళ్లిసందD
1


శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక, శ్రీలీల జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా పెళ్లి సందD. థియేటర్స్‌లో మంచి విజయం సాధించిన ఈ చిత్రం జనవరి 14న హాట్ స్టార్ డిస్నీ వేదికగా విడుదల కానుంది.

అఖండ
2

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా జనవరి 21 న హాట్ స్టార్ డిస్నీ లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీ గా ఉంది.

శ్యామ్ సింగరాయ్
3

నాచురల్ స్టార్ నాని, కృతి శెట్టి, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ జనవరి 21 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

 

రాజా విక్రమార్క
4

ఈ సినిమా కూడా జనవరి లోనే ప్రేక్షకులు ముందుకొస్తుంది. ఆహ వేదికగా జనవరి 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది అమెరికన్‌ డ్రీమ్‌
5

ది అమెరికన్‌ డ్రీమ్‌ ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ఇది. అమెరికాలో ఓ కుర్రాడికి ఎదురయ్యే కష్టాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. విఘ్నేశ్‌ కౌశిక్‌ దర్శకుడు. నేహా ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం జనవరి 14న ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది.

పుష్ప
6

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయినా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  జనవరి 7న అమెజాన్‌ ప్రైమ్‌లో పుష్ప మూవీ  స్ట్రీమింగ్‌

 

అర్జున ఫాల్గుణ
7

అర్జున ఫాల్గుణ మూవీ Jan 26న ఆహ లో స్ట్రీమింగ్  అయ్యింది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+