పొన్నియన్ సెల్వన్-1 సినిమా డ్రామా, ఎపిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీక్, త్రిష త్రిష కృష్ణన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, నిజలగల్ రవి, లాల్, ప్రభు, నాజర్, కిషోర్, విక్రమ్ ప్రభు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణి రత్నం వహించారు. నిర్మాత సుభాష్ కరణ్ నిర్మించారు. సంగీతం ఏ ఆర్ రెహ్మాన్ అందించారు
కథ
సామ్రాజ్య విస్తరణలో భాగంగా పాండ్య, రాష్ట్రకూటులు, ఇతర దేశాలను హస్తగతం చేసుకోవడంతో పొన్నియన్ సెల్వన్ కథ మొదలవుతుంది. విక్రమ్ (ఆదిత్య) తన సైన్యంలో వీరుడు కార్తీని తన తండ్రి సుందరచోళ వద్దకు పంపడంతో కథ ఊపందుకొంటుంది. సుందర చోళ చుట్టు.. అంత:పురంలో జరిగే కుట్రలు, వ్యూహాలతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అయితే కథ సామాన్య ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా.. పాత్రల మధ్య సంబంధాలను వివరించే క్రమంలో దర్శకుడు మణిరత్నం తడబాటుకు గురయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా అర్ధం కాని కథను తెర మీద మరింత క్లిష్టంగా మార్చాడు. విక్రమ్ (ఆదిత్య), ఐశ్వర్య రాయ్ (నందిని) మధ్య రిలేషన్ ఏమిటి? నాజర్‌కు, అలాగే శరత్ కుమార్‌కు ఐశ్వర్యరాయ్‌కి మధ్య ఎలాంటి బంధం ఉందనే విషయాన్ని స్పష్టీకరించలేకపోవడం కంగాళీగా మారుతుంది. ఇక తాను తన ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన నందిని (ఐశ్వర్య) వ్యవహార తీరుతో ఆదిత్య (విక్రమ్) మనస్తాపం చెందడం అనే ఎమోషనల్ విషయాన్ని క్లారిటీతో చెప్పలేకపోయారనిపిస్తుంద. ఇలా ఫస్టాఫ్ రకరకాల గందరగోళాల మధ్య ముగుస్తుంది.