ప్రేమ కథా చిత్రమ్ సినిమా కామిడి రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, నందిత, ప్రదీప్, హాసిక, అదుర్స్ రఘు, ఏలూరు శ్రీను, రణధీర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే, మాటలు: మారుతి మరియు నిర్మాతలు: మారుతి, సుదర్శన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బేబి స్వరాలు సమకుర్చారు.
కథ
ఇక సుధీర్ తన గర్ల్ ప్రెండ్ మోసం చేయటంతో తను జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటాడు. అయితే నందిత అతన్ని సీక్రెట్ గా ప్రేమిస్తూంటుంది. ..ఆమెకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండదు. దాంతో ఇది గమనించిన సుధీర్ ప్రెండ్ ప్రవీణ్ సలహాతో ఆమె అతని మైండ్ మార్చటానికి వస్తుంది. అక్కడ నుంచి ప్రవీణ్ సూసైడ్ టైమ్ ని ప్రొలాంగ్ చేయటానికి ప్రయత్నిస్తూంటాడు...నందిత...సుధీరక్ లో మార్పు తేవటానికి ప్రయత్నిస్తూంటుంది. టైమ్ తక్కువుంటుంది. ఈ లోగా ఓ ట్విస్టు..అదే కథని మలుపు తిప్పుతుంది... ప్రాణాలు పోగొట్టుకుందామనుకున్న వాళ్లు ప్రాణాలు రక్షించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. అప్పుడేమయింది అనేది మిగతా కథ.