భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన టాలీవుడ్‌లో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతూ బాలీవుడ్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీగా తన సత్తా చాటుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్నో గర్వించ దగ్గ సినిమాలు వచ్చాయి. అందులో దేశభక్తిని పెంపొందించే సినిమాలు ఎన్నో తెరకెక్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి.