ప్రేమతో రా సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, సిమ్రాన్, ఆశ సైని, ప్రేమ, కోటా శ్రీనివాస రావు, సురేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఉదయ్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత టి త్రివిక్రమ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
చందు (వెంకటేష్) మరియు విజయ్ (సురేష్) ఇద్దరు అన్నదమ్ములు..వీళ్ళది బాగావున్న కుటుంబం. విజయ్ తమ కుటుంబ బాజ్యతలు, వ్యాపారాలు అన్ని తనే చూసుకుంటాడు కాని చందు జాలీగా తీరుగుతుంటాడు. విజయ్ సౌందర్య (ప్రేమ) ప్రేమలో పడతాడు..అలాగే చందు కుడా అనుకోకుండా ఊటిలో గీత (సిమ్రాన్) ను చూసి ప్రేమిస్తాడు..తన ప్రేమను గీతకు చేప్పుతాడు. ఆ వెంటనే చందు గీత కు చేప్పకుండా హైదిరాబాదుకు తన అన్న విజమ్ మరియు సౌందర్య ల పెళ్ళికు వస్తాడు. సౌందర్య అప్పుడు తన చేలేలు అయిన గీతను అందరికి పరిచయం చేస్తుంది..చందు గీత లు ప్రేమ అందరికి తేలుస్తుంది..వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడతారు కాని సౌందర్య విజయ్ తో తన పెళ్ళి ని రద్దుచేసుకుంది. అలా ఎందుకు చేసింది..అలాగే దానికి కారాణం ఎంటనేది...చందు వాళ్ళను ఎలా పెళ్ళికి ఒప్పిస్తాడు అనేది మిగతా కథా..