రా రా కృష్ణయ్య సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్‌కిషన్, జగపతిబాబు, రెజీనా, కల్యాణి, తనికెళ్ల భరణి, రవిబాబు, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, చలపతిరావు, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్, దువ్వాసి మోహన్, వాసు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈసినిమాకి రచన, దర్శకత్వం: మహేష్‌బాబు పి నిర్వహించారు మరియు ఎస్.వి.కె. సినిమా సంస్థలో నిర్మాత: వంశీ కృష్ణ శ్రీనివాస్ సి హెచ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు.
కథ
కృష్ణయ్య ఉరఫ్ కిట్టు (సందీప్ కిషన్) చెన్నైలో మాణిక్యం మొదలియార్(తనికెళ్ళ భరణి) క్యాబ్ కంపెనీలో డ్రైవర్ గా చేస్తూ ఉంటాడు. అతను కష్టపడి సంపాదించిన మొత్తాన్ని తన యజమాని మాణిక్యం దగ్గర దాచుకుంటాడు(బ్యాంకులు గట్రా లేవా అని అడొగద్దు). పాత సినిమాల్లో విలన్ లాగ ..మాణిక్యం మోసం చేస్తాడు. దాంతో రగిలిపోయిన కిట్టు...యజమని కూతురైన నందీశ్వరి ఉరఫ్ నందు (రెజీనా)ని కిడ్నాప్ చేస్తాడు. అయితే నందుకి ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తూంటారు. దాంతో కిడ్నాప్ కి భాధ పడాల్సిన నందు... ఆనందంతో కిట్టు వెనకాల వెళ్ళిపోతుంది. అంతేగాక ఈ కాలం రొటీన్ సినిమాల స్క్రీన్ ప్లే ని ఫాలో అవుతూ...ప్రేమగా పడిపోతుంది. అయితే ఈలోగా అనుకోని విధంగా ఆమె జగ్గుభాయ్(జగపతిబాబు) చేత కిడ్నాప్ గురి అవుతుంది. ఇంతకీ జగ్గుభాయ్ ఎవరు...హీరోయిన్ ని ఎందుకు కిడ్నాప్ చేసారు అనే విషయాలు తెలుసుకోవాలంటే 'పస్ గయా ఒబామా' సినిమా చూడని వారు తప్పని సరిగా చూడాలి.