రాగల 24 గంటల్లో సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్యదేవ్, ఇషా రెబ్బా, శ్రీకాంత్, గణేష్ వెంకట్రామన్, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస రెడ్డి వహించారు మరియు నిర్మాత కనురు శ్రీనివాస్ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతం రఘు కుంచే అందించారు.
కథ
మేఘన (ముస్కాన్ సేథ్) అనే అమ్మాయిని దారుణంగా మానభంగం చేసిన కేసులో పునిత్, వినీత్, అద్విత్ అనే ముగ్గురిని ఏసీపీ నరసింహా (శ్రీరామ్) అరెస్ట్ చేస్తాడు. ఒకరోజు ఈ ముగ్గురు జైలు నుంచి తప్పించుకుంటారు. అలా పారిపోతూ.. ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఇంట్లోకి చొరబడతారు. అయితే అప్పటికే ఆ ఇంట్లో రాహుల్ భార్య విద్య (ఈషారెబ్బా) ఒంటరిగా ఉంటుంది. తన భర్తను తానే చంపినట్టు కథ మొత్తం ఆ ముగ్గురికి చెబుతుంది. తన స్నేహితుడు గణేష్ రాహుల్‌ను హత్య చేసి ఉంటాడన్న అనుమానంతో ఆ నేరం తనపై వేసుకుంటుంది. అయితే గణేష్ ఆ హత్య చేయలేదని విద్యకు తెలుస్తుంది? రాహుల్‌ను ఎవరు హత్య చేశారు? ఆ హత్య వెనుక ఉన్న నేపథ్యం ఏంటి అన్నదే కథ.