రభస సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్టీఆర్, సమంత, ప్రణీత, షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ప్రధానమైన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ మరియు నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
కార్తీక్ (ఎన్టీఆర్) ...తన తల్లి(జయసుధ) కి మరదలు(మామయ్య షాయీజీ షిండే కూతురు)నే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే అంత ఈజీ కాదు. తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రి(నాజర్)తో విభేదించి సిటీకి వెళ్లి ఎదుగుతాడు. దాంతో ఇప్పుడు తన మరదలుని వెతుక్కుంటూ సిటీకి వస్తాడు. అక్కడకి వచ్చాక బాగ్యం(ప్రణీత)ని చూసి పొరబడి ఆమే తన మరదలు అనుకుని ఆమె వెంటబడతాడు. కొంత దూరం ఆ ప్రేమ ప్రయాణం జరిగాక... తన మరదలు ఆమెకాదు... తను ఎప్పుడూ గొడవపడే ఇందు (సమంత)అని రివిల్ అవుతుంది. సర్లే ఇందునే లైన్ లో పెడదామనుకుంటే ఇందు ఆల్రెడీ వేరే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అలాంటి పరిస్ధుతుల్లో కార్తీక్ తన తల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు...ఇందుని ఎలా ఒప్పించాడు అనేది రక రకాల ట్విస్ట్ లతో కూడిన కథ