వెండితెరపై తమ అభిమాన నటుడు ఒక పాత్రలో కనిపిస్తేనే అభిమానులు ఉత్సాహంతో ఈలలు కేకలు వేస్తారు. మరి ఆయా హీరోలు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేస్తే.. ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ రెండు లేదా మూడు అంతకంటే ఎక్కవ పాత్రలను ఒకే నటుడు చేయాలంటే మాత్రం అంత ఆషామాషీ విషయం కాదు.. ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. ట్రిపుల్ రోల్ చెయ్యడం తెలుగు హీరోలకు క్రొత్త కాదు సీనియర్ ఎన్టీఆర్ నుంచి సుధీర్ బాబు వరకూ ట్రిపుల్ రోల్స్ చేసి మెప్పించిన హీరోలు ఎవరో తెలుసుకుందాం.