రాజా ది గ్రేట్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజా, మెహరీన్, రాధిక సరత్ కుమార్, సంపత్ రాజ్, బెనర్జీ, రాసి కన్నా, శ్రీనివాస రెడ్డి, భరత్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, ప్రభాస్ శ్రీను, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, పృద్వీ, రాజివ్ కనకాల, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావిపూడి వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయికార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
లక్కీ (మెహ్రీన్) తండ్రి ప్రకాశ్‌రాజ్ నిఖార్సైన పోలీస్ ఆఫీసర్. విధి నిర్వహణలో విలన్ (వివాన్ భటేనా) చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. తన తమ్ముడి మరణానికి కారణమైన లక్కీని చంపాలనుకొంటాడు. ఇక రాజా (రవితేజ) పుట్టుకతోనే గుడ్డి. పోలీసు ఉద్యోగి అనంత లక్ష్మి (రాధిక) కుమారుడు రాజా. రాజాను పోలీస్‌గా చూడాలనుకొంటుంది. కానీ అంధుడు కావడం వల్ల పోలీస్ శాఖ ఒప్పుకోదు. అయితే అంధుడైనప్పటికీ అన్ని విద్యల్లో పర్‌ఫెక్ట్‌గా శిక్షణ పొందుతాడు. చాలా స్టయిలీష్‌గా ఉండటం రాజాకు చాలా ఇష్టం. ఇలా జీవితం కొనసాగిస్తుండగా లక్కీ జీవితంలోకి రాజా ప్రవేశిస్తాడు. లక్కీని చంపాలనుకొన్న విలన్ బారి నుంచి గుడ్డివాడైన రాజా సిద్ధమవుతాడు. పోలీస్ డిజైన్ చేసిన ఆపరేషన్‌లో భాగమవుతాడు. పోలీస్ ఆపరేషన్ ఏ విధంగా నిర్వహించాడు. విలన్ ఆట ఎలా కట్టించాడు. తండ్రి ఆశయాన్ని కొనసాగించడానికి లక్కీ ఎలాంటి కష్టాలు పడింది. గుడ్డివాడిగా రవితేజ ఎలా మెప్పించాడు. కుటుంబ వ్యతిరేకతను ఎదుర్కొన్న మెహ్రీన్ ఏ విధంగా సహాయపడ్డారు. సొంత భార్యలపై అరాచకానికి పాల్పడే మెహ్రీన్ బాబాయిలను గుణపాఠం ఎలా నేర్పాడు. ఇంకా వివిధ విభాగాల పనితీరు ఎలా ఉందనే ప్రశ్నలకు సమాధానమే రాజా ది గ్రేట్ మూవీ.