రాజు గారి గది 2 సినిమా హర్రర్, థ్రిల్లర్, కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, సమంత, త్రిష కృష్ణన్, వెన్నెల కిశోర్, అశ్విన్ బాబు, ప్రవీణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఓంకార్ వహించారు మరియు ప్రసాద్ వి పొట్లూరి మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు.
కథ
అశ్విన్, కిషోర్, ప్రవీణ్ ముగ్గురూ కలిసి రాజుగారు కట్టించిన ఓ రిసార్టును కొనుగోలు చేస్తారు. రిసార్ట్ బిజినెస్ బాగా సాగుతుందనుకుంటున్న తరుణంలో అమృత(సమంత) అనే ఆత్మ వారిని ఇబ్బందుల్లో పడేస్తుంది. దెయ్యం ఉందని తెలియడంతో రిసార్టుకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయి బిజినెస్ దెబ్బతింటుంది. దాన్ని అమ్మేసుకుందామన్నా కొనేవారు ఎవరూ ఉండరు. చర్చి ఫాదర్ సూచన మేరకు వారు ఈ సమస్యను పరిష్కరించేందుకు రుద్ర(నాగార్జున) అనే మెంటలిస్టును ఆశ్రయిస్తారు. అసలు అమృత దెయ్యంగా ఎందుకు మారింది? ఈ రిసార్టునే ఎందుకు టార్గెట్ చేసింది? సైన్సును నమ్మే మెంటలిస్టు.... ఆత్మలను ఎలా హ్యాండిల్ చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.