రాజు గారి కోడిపులావ్ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో కోన ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ కోన వహిస్తున్నారు. నిర్మతలు శివ కోన, అనిల్ మోదుగ కలీసి నిర్మిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ మణి అందిస్తున్నారు.
రిలీజ్
ఆగస్ట్ 4న విడుదల చేస్తున్నారు
ట్రైలర్
అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చేతిలో చికెన్ ముక్క పట్టుకొని ఓ పాప అడవిలో ఎంట్రీతో ట్రైలర్ మొదలవుతుంది. రాజు గారి కోడి పులావ్ తో ఎంతో ఫేమస్ అయినా ఈ టీవీ ప్రభాకర్ ఈ ట్రైలర్లో తన కుటుంబ నేపథ్యాన్ని చెబుతుంటాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులు రోడ్ ట్రిప్ ప్లాన్ వేసుకొని ఒక అడవిలోకి ఎంటర్ అవుతారు. కారు సడన్గా బ్రేక్ డౌన్ అవుతుంది దాంతో వాళ్లు అడవిలోకి కాలినడకన వెళ్తారు. అక్కడినుండి కథలో మెయిన్ కాంప్లెక్ట్ మొదలు అవుతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.