రామారావు ఆన్ డ్యూటీ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి, జాన్ విజయ్, తనికెళ్ళ భరణి, నరేష్, నాజర్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. సామ్ సీఎస్ సంగీతం అందించారు.
కథ
అన్యాయాలను ఎదురిస్తూ నీతి, నిజాయితీతో విధులు నిర్వహించే రామారావు శ్రీకాకుళం జిల్లాలో (రవితేజ) డిప్యూటీ కలెక్టర్ (ఎంఆర్వో)గా పనిచేస్తుంటాడు. అయితే తన మాజీ ప్రేయసి మాలిని (రజీషా విజయన్)ను కలుసుకొన్న సమయంలో తన భర్త తప్పిపోయినట్టు తెలుసుకొంటాడు. అలా తప్పిపోయిన తన మాజీ ప్రేయసి భర్త గురించి ఆరా తీస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో 20కిపైగా మంది కనిపించకుండా పోయారనే విషయం రామారావుకు తెలుస్తుంది. ఆ క్రమంలో రామారావు ఎర్రచందనం స్మగ్లింగ్‌పై దృష్టిపెడుతాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో హత్యలు ఎందుకు జరిగాయి? మిస్సింగ్ కేసుల వ్యవహారంలో రామారావు ఎలాంటి దర్యాప్తు చేపట్టారు? రామారావు ఇన్వెస్టిగేషన్‌లో భార్య నందిని (దివ్యాంశ కౌశిక్), తండ్రి (నాజర్), సోదరుడు (రాహుల్ రవీంద్రన్) పాత్రలు ఏమిటి? సీఐ జమ్మి మురళి (వేణు తొట్టెంపూడి) రామారావుకు సహకరించాడా? ఎస్పీ దేవానంద్ (సర్పెట్టా జాన్ విజయ్) ఎలాంటి ఎత్తులు పన్నాడు. తన దర్యాప్తులో ఎలాంటి సంచలన విషయాలు రామారావుకు ఎదురుపడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానమే రామారావు ఆన్ డ్యూటీ సినిమా కథ.