నితిన్ తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ దాదాపు అందరి స్టార్ డైరెక్టర్లతోనూ సినిమాలు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో 'సై',త్రివిక్రమ్ డైరెక్షన్లో 'అఆ', వినాయక్ డైరెక్షన్లో 'దిల్', పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 'హార్ట్ ఎటాక్', కృష్ణ వంశీ డైరెక్షన్లో 'శ్రీ ఆంజనేయం', తేజ డైరెక్షన్లో 'జయం' 'ధైర్యం' వంటి సినిమాలు చేశాడు. ఇప్పటి వరకు అతడు 25 సినిమాలు చేశారు. ఇందులో పలు హిట్ సినిమాలు ఉండగా.. ఎన్నో ఫ్లాప్ మూవీలు కూడా ఉన్నాయి. ఐతే నితిన్ ఇప్పటి వరకు 12 సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. కొన్ని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వదలుకున్నారు. మరికొన్నింటినీ కాంబినేషన్ సెట్ కాక తిరస్కరించారు. ఆ మూవీలు ఏంటో ఇక్కడ చూడండి. ఆర్య, ధన 51, భలే దొంగలు, మనం, పిల్లా నువ్వు లేని జీవితం, శతమానం భవతి, ఇస్మార్ట్ శంకర్, రాక్షసుడు, గల్లీ బాయ్ తెలుగు రీమేక్, ఒరేయ్ బుజ్జిగా, పవర్ పేట, మా అమ్మ మహాలక్ష్మి.. తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ ఈ సినిమాలను మిస్ చేసుకున్నాడు.