X
తెలుగు » సినిమాలు » రామారావు ఆన్ డ్యూటీ
రామారావు ఆన్ డ్యూటీ

రామారావు ఆన్ డ్యూటీ

Action | 29 Jul 2022 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రామారావు ఆన్ డ్యూటీ స్టోరీ

రామారావు ఆన్ డ్యూటీ  సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, జాన్ విజయ్, తనికెళ్ళ భరణి, నరేష్, నాజర్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు ఈ మూవీకి శరత్‌ మండవ దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందించారు.  కథ అన్యాయాలను ఎదురిస్తూ నీతి, నిజాయితీతో విధులు నిర్వహించే రామారావు శ్రీకాకుళం జిల్లాలో (రవితేజ) డిప్యూటీ కలెక్టర్ (ఎంఆర్వో)గా పనిచేస్తుంటాడు. అయితే తన మాజీ ప్రేయసి మాలిని (రజీషా విజయన్)ను కలుసుకొన్న సమయంలో తన భర్త తప్పిపోయినట్టు తెలుసుకొంటాడు. అలా తప్పిపోయిన తన మాజీ ప్రేయసి భర్త గురించి ఆరా తీస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో 20కిపైగా మంది కనిపించకుండా పోయారనే విషయం రామారావుకు తెలుస్తుంది. ఆ క్రమంలో రామారావు ఎర్రచందనం స్మగ్లింగ్‌పై దృష్టిపెడుతాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ వ్యవహారంలో హత్యలు ఎందుకు జరిగాయి? మిస్సింగ్ కేసుల వ్యవహారంలో రామారావు ఎలాంటి దర్యాప్తు చేపట్టారు? రామారావు ఇన్వెస్టిగేషన్‌లో భార్య నందిని (దివ్యాంశ కౌశిక్), తండ్రి (నాజర్), సోదరుడు (రాహుల్ రవీంద్రన్) పాత్రలు ఏమిటి? సీఐ జమ్మి మురళి (వేణు తొట్టెంపూడి) రామారావుకు సహకరించాడా? ఎస్పీ దేవానంద్ (సర్పెట్టా జాన్ విజయ్) ఎలాంటి ఎత్తులు పన్నాడు. తన దర్యాప్తులో ఎలాంటి సంచలన విషయాలు రామారావుకు ఎదురుపడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానమే రామారావు ఆన్ డ్యూటీ సినిమా కథ.
Read More

రామారావు ఆన్ డ్యూటీ కాస్ట్ & క్రూ

రామారావు ఆన్ డ్యూటీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శరత్‌ మండవ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శ్యామ్ సి ఎస్
నిర్మాత సుధాకర్ చెరుకూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రామారావు ఆన్ డ్యూటీ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్‌గా వ్యక్తుల మిస్సింగ్ ఎలిమెంట్స్ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. రవితేజ క్రేజ్‌కు, ఫాలోయింగ్‌కు భిన్నంగా చేసిన చిత్రంగా కనిపిస్తుంది. అపరిపక్వతతో కూడిన కథ, కథనాలు, శరత్ మండవ దర్శకత్వ లోపాలు సినిమాకు మైనస్‌‌గా మారాయి. రవితేజ కెరీర్‌లో ఊహించని ఫలితం ఈ సినిమాకు ఎదురైన పరిస్థితి. ఈ సినిమాలో ఉపశమనం ఏమిటంటే.. నరేష్, పవిత్రా లోకేష్ ఒకే సీన్‌లో కన్పించినప్పుడల్లా కేకలు పెట్టడం థియేటర్లలో కొంత కామెడీగా అనిపిస్తుంది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ ఫలితాలు రాబట్టడానికి ఛాన్స్ ఉంది. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా పరిస్థితి ఏమిటో స్పష్టమవుతుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే సంకేతాలను వదలడంతో.. రెండో భాగమైనా సరిగా తీస్తారా అనే కామెంట్స్ థియేటర్లలో వినిపించాయి.

రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్

Video Thumbnail

రామారావు ఆన్ డ్యూటీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రామారావు ఆన్ డ్యూటీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+