రంగ రంగ వైభవంగా (2022)(U/A)
Release date
02 Sep 2022
genre
రంగ రంగ వైభవంగా స్టోరి
రంగ రంగ వైభవంగా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, సుబ్బరాజు, నరేష్, ప్రభు, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గిరీశాయ వహించారు. నిర్మాత బి వి ఎస్ ఎన్ నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.
కథ
రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నతనంలోనే ఇగో కారణంగా వారి మధ్య చిన్న గొడవ చోటుచేసుకొంటుంది. దాంతో వారిద్దరూ కలిసి ఉంటూనే రిలేషన్ పరంగా దూరంగా ఉంటారు. రిషి తండ్రి (నరేష్), రాధ తండ్రి (ప్రభు) కుటుంబాల మధ్య విడదీయలేనంత స్నేహం ఉంటుంది. రాధ అన్న అర్జున్ (నవీన్ చంద్ర) ఐఐటీలో చదివి రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా రెండు కుటుంబాలు అన్యోన్యతతో ఉంటుండగా.. ఓ పెళ్లి అంశం కారణంగా రెండు కుటుంబాలు విడిపోవాల్సి వస్తుంది. రిషికి, రాధాకు చిన్నతనంలో ఎందుకు గొడవలు వచ్చాయి? రిషికి, రాధాకు మధ్య ఉన్న గొడవ కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి? పెళ్లి కారణంగా విడిపోయిన కుటుంబాలను కలిపే ప్రయత్నంలో రిషి, రాధాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. నవీన్ రాజకీయంగా ఎలాంటి స్థితికి చేరుకొన్నారు. చివరకు రెండు ఫ్యామిలీలు కలవడానికి రిషి, రాధా ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగ రంగ వైభవంగా సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie రంగ రంగ వైభవంగా with us? Please send it to us ([email protected]).