X
తెలుగు » సినిమాలు » రంగ రంగ వైభవంగా
రంగ రంగ వైభవంగా

రంగ రంగ వైభవంగా

Romance | 02 Sep 2022 | U/A | 143 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

రంగ రంగ వైభవంగా స్టోరీ

రంగ రంగ వైభవంగా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, సుబ్బరాజు, నరేష్, ప్రభు, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గిరీశాయ వహించారు. నిర్మాత బి వి ఎస్ ఎన్ నిర్మించారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు.  కథ రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతికా శర్మ) ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నతనంలోనే ఇగో కారణంగా వారి మధ్య చిన్న గొడవ చోటుచేసుకొంటుంది. దాంతో వారిద్దరూ కలిసి ఉంటూనే రిలేషన్ పరంగా దూరంగా ఉంటారు. రిషి తండ్రి (నరేష్), రాధ తండ్రి (ప్రభు) కుటుంబాల మధ్య విడదీయలేనంత స్నేహం ఉంటుంది. రాధ అన్న అర్జున్ (నవీన్ చంద్ర) ఐఐటీలో చదివి రాజకీయాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా రెండు కుటుంబాలు అన్యోన్యతతో ఉంటుండగా.. ఓ పెళ్లి అంశం కారణంగా రెండు కుటుంబాలు విడిపోవాల్సి వస్తుంది. రిషికి, రాధాకు చిన్నతనంలో ఎందుకు గొడవలు వచ్చాయి? రిషికి, రాధాకు మధ్య ఉన్న గొడవ కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి? పెళ్లి కారణంగా విడిపోయిన కుటుంబాలను కలిపే ప్రయత్నంలో రిషి, రాధాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. నవీన్ రాజకీయంగా ఎలాంటి స్థితికి చేరుకొన్నారు. చివరకు రెండు ఫ్యామిలీలు కలవడానికి రిషి, రాధా ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే రంగ రంగ వైభవంగా సినిమా కథ.
Read More

రంగ రంగ వైభవంగా కాస్ట్ & క్రూ

రంగ రంగ వైభవంగా సిబ్బంది సమాచారం

దర్శకత్వం గిరీశాయ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రంగ రంగ వైభవంగా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కథ, కథనాల్లో కొతదనం లేని, ఎమోషన్స్ పెద్దగా పండని చిత్రం రంగ రంగ వైభవంగా. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను, యూత్‌ను టార్గెట్ చేసిన సినిమా ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. కథ, కథనాలు, సన్నివేశాల పరంగా, వైష్ణవ్ తేజ్, కేతికా క్యారెక్టర్ల పరంగా జాగ్రత్తలు తీసుకొని ఉంటే మంచి సినిమా అయి ఉండేది. అద్బుతమైన స్టార్ కాస్టింగ్‌ను ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే ఈ సినిమా విజయం సాధించే అవకాశం ఉంది.

రంగ రంగ వైభవంగా ట్రైలర్

Video Thumbnail

రంగ రంగ వైభవంగా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రంగ రంగ వైభవంగా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+