రెబల్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, తమన్నా, దీక్షాసేథ్, కృష్ణంరాజు, బ్రహ్మానందం, అలీ, సుప్రీత్, ముఖేష్ రుషి, ఎంఎస్ నారాయణ, ప్రభ, హేమ, సన, రజిత, ముంబయి విలన్స్ శంకర్, విశాల్, ఆకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-స్ర్కీన్ ప్లే-కొరియోగ్రఫీ-సంగీతం-దర్శకత్వం: రాఘవ లారెన్స్ నిర్వహించారు, నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లరావు నిర్మించారు.
కథ
రిషి(ప్రభాస్) స్టీఫెన్ రాబర్ట్ అనే మాఫియా డాన్స్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తాడు. వారి ఎడ్రస్ ట్రేస్ చేయటం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగా బ్యాంకాక్ వెళ్లి మరీ వారి అసెస్టెంట్ నాను కూతరు నందిని(తమన్నా)ని ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తాడు. ఇంతకీ రిషి అంత డెస్పరేట్ గా స్టీఫెన్ రాబర్డ్ ని వెతకాల్సిన పనేంటి...వారికి అతని కుటుంబానికి సంభందం ఏమిటి...ఇంతకీ రిషి ని రెబెల్ అని ఎందుకు పిలుస్తారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.