X
రెమో
Comedy | Romance | 25 Nov 2016 |
Telugu

రెమో స్టోరీ

రెమో సినిమా తమిళంలో తీసి తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు ఇది కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివకార్తికేయన్, కీర్తిసురేష్, కె ఎస్ రవి కుమార్, సతీష్, రాజేంద్ర, సరణ్య పొన్వనన్, ఆదుకలం నరెన్, యోగి బాబు, స్వమినాథన్, మహిల్సామి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బక్కియ రాజ్ కన్నన్ నిర్వహించారు  మరియు శ్రీ వెంకటేశ్వర క్రిమేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెలుగు లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చరు. 

కథ

సినిమా పిచ్చోడు...తెరపై స్టార్ హీరోగా వెలిగిపోవాలని కోరిక ఉన్నవాడు శివ (శివకార్తికేయన్‌). అందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్న అతను సాధ్యమైనంతగా అమ్మాయిలకు దూరంగా ఉంటూంటాడు. కానీ ఓ రోజు కావ్య (కీర్తి సురేష్‌)ని చూసి ఇష్టపడతాడు. ఆమెకి తెలియకుండా ఆమెని ప్రతి క్షణం నీడలా వెంటాడుతుంటాడు. ధైర్యం చేసి తన ప్రేమ విషయం చెప్పుదామని ఆమె ప్లాట్ కు వెళ్లేసరికి...అక్కడ .. కావ్యకు సంబంధించిన ఓ విషయం తెలుస్తుంది. అదేమిటంటే...విశ్వ అనే డాక్టర్ తో ఆమెకు నిశ్చితార్దం. దాంతో నిరాశలో కూరుకుపోయి తన ప్రేమ బయటపెట్టడు. ఆ తర్వాత దర్శకుడు కె ఎస్ రవికుమార్ ...నర్స్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసి... నర్సు వేషంలో అక్కడికి వెళ్తాడు. అయితే లవ్ యాక్ట్ చేయమంటే చేయలేకపోతాడు శివ. దాంతో దర్శకుడు నో చెప్పి వెళ్లిపొమ్మంటాడు. అలా సినిమా ట్రైల్స్ లో భాగంగా అనుకోకుండా ఓసారి నర్సు వేషం వేస్తూ... ఆ గెటప్ లోనే బస్ ఎక్కిన అతనికి కావ్య కనపడుతుంది. కావ్యకు .. రెమోగా పరిచయం చేసుకొంటాడు. రెమో అమ్మాయే అనుకొని తనతో చనువుగా ఉంటుంది కావ్య. బాగా మాట్లాడుతుంది. అంతేకాకుండా కావ్య ...తన ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం కూడా ఇప్పిస్తుంది. కేవలం కావ్యకు దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో అదే వేషం కొనసాగిస్తాడు. ఆ తరవాత ఏమైంది? ఆడ వేషంలో కావ్యకి దగ్గరైన శివ.. తన ప్రేమని బయటపెట్టాడా, లేదా? సినిమాలో హీరో అయ్యాడా లేదా అనేదే 'రెమో' కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+