రైట్ రైట్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, పూజ ఝావేరి, ప్రభాకర్, నాజర్, భరత్ రెడ్డి, ధన్ రాజ్, శకలక శంకర్, తాగుబోతు రమేష్, రాజా రవింద్ర, సుధ, వినోద్ కృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మను నిర్వహించారు మరియు నిర్మాత వంశీ కృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతర్శకుడు జె బి స్వరాలు సమకుర్చరు.
కథ
తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత మీద పడటంలో తప్పని సరి పరిస్థితుల్లో పోలీస్ కావాలన్న తన లక్ష్యాన్ని పక్కన పెట్టిన రవి (సుమంత్ అశ్విన్) ఎస్.కోట నుండి గవిటి అనే గ్రామానికి వెళ్లే బస్సు కండక్టర్ ఉద్యోగంలో చేరుతాడు. ఈ ఆ బస్సుకి డ్రైవర్ శేషు (ప్రభాకర్). ఈ క్రమంలో గవిటి గవిటి గ్రామానికి చెందిన వారితో వీరికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. బస్సు కండక్టరుగా అలా సాగిపోతున్న రవి జీవితంలో ఊహించని సంఘట. కొన్ని కారణాల వల్ల రవి బస్సు నడపటం, బస్సు రోడ్డుపై ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. కిందకి దిగి చూసే సరికి బస్సు ముందు ఓ యువుకడు చావు బతుకుల మధ్య పడి వుంటాడు. తన వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావించిన రవి వెంటనే అతన్ని అదే దారిలో వెలుతున్న జీపులో ఆస్పత్రికి పంపుతాడు. అతడు గివిటి సర్పంచ్ విశ్వనాథం అబ్బాయి దేవా అని తెలుసుకుని అతని పరిస్థితి ఎలా ఉందో చూడటానికి ఆసుపత్రికి వెల్లిన రవికి అతడు ఎక్కడా కనిపించకపోగా..... ఊరి బయట దేవా శవమై తేలుతాడు. దీంతో నేరం రవి మీద పడుతుంది. దేవా హత్య వెనక ఎవరు ఉన్నారు? ఈ కేసు నుండి రవి, శేషులు ఎలా బయట పడ్డారు అనేది తెరపై చూడాల్సింది.