X
తెలుగు » సినిమాలు » రైట్ రైట్
రైట్ రైట్

రైట్ రైట్

Romance | 10 Jun 2016 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

రైట్ రైట్ స్టోరీ

రైట్ రైట్ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్ అశ్విన్, పూజ ఝావేరి, ప్రభాకర్, నాజర్, భరత్  రెడ్డి, ధన్ రాజ్, శకలక శంకర్, తాగుబోతు రమేష్, రాజా రవింద్ర, సుధ, వినోద్ కృష్ణన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మను నిర్వహించారు మరియు నిర్మాత వంశీ కృష్ణా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతర్శకుడు జె బి స్వరాలు సమకుర్చరు.  కథ తండ్రి మరణంతో కుటుంబ బాధ్యత మీద పడటంలో తప్పని సరి పరిస్థితుల్లో పోలీస్ కావాలన్న తన లక్ష్యాన్ని పక్కన పెట్టిన రవి (సుమంత్‌ అశ్విన్‌) ఎస్.కోట నుండి గవిటి అనే గ్రామానికి వెళ్లే బస్సు కండక్టర్‌ ఉద్యోగంలో చేరుతాడు. ఈ ఆ బస్సుకి డ్రైవర్‌ శేషు (ప్రభాకర్‌). ఈ క్రమంలో గవిటి గవిటి గ్రామానికి చెందిన వారితో వీరికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. బస్సు కండక్టరుగా అలా సాగిపోతున్న రవి జీవితంలో ఊహించని సంఘట. కొన్ని కారణాల వల్ల రవి బస్సు నడపటం, బస్సు రోడ్డుపై ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. కిందకి దిగి చూసే సరికి బస్సు ముందు ఓ యువుకడు చావు బతుకుల మధ్య పడి వుంటాడు. తన వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావించిన రవి వెంటనే అతన్ని అదే దారిలో వెలుతున్న జీపులో ఆస్పత్రికి పంపుతాడు. అతడు గివిటి సర్పంచ్ విశ్వనాథం అబ్బాయి దేవా అని తెలుసుకుని అతని పరిస్థితి ఎలా ఉందో చూడటానికి ఆసుపత్రికి వెల్లిన రవికి అతడు ఎక్కడా కనిపించకపోగా..... ఊరి బయట దేవా శవమై తేలుతాడు. దీంతో నేరం రవి మీద పడుతుంది. దేవా హత్య వెనక ఎవరు ఉన్నారు? ఈ కేసు నుండి రవి, శేషులు ఎలా బయట పడ్డారు అనేది తెరపై చూడాల్సింది.
Read More

రైట్ రైట్ కాస్ట్ & క్రూ

రైట్ రైట్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మను
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జెబి
నిర్మాత వంశీ కృష్ణా రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రైట్ రైట్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమాకు కథే పెద్ద మైస్....ఇలాంటి రొటీన్ కథ ఎంచుకున్నా ప్రేక్షకుల్లో సస్పెన్స్ రేకెత్తిస్తూ థ్రిల్లర్‌ తరహా స్క్రీన్ ప్లే కొనసాగించాలి. హత్యోదంతం చుట్టూ కథనం తిరుగుతున్నపుడు చాలా ట్విస్టులు, సస్పెన్స్ సీన్లు రాసుకునే వీలున్నా దర్శకుడు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. జరుగబోయేది ప్రేక్షకులు ముందే ఊహించే విధంగా స్క్రీన్ ప్లే సాగుతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లుతుంది. వాటితో సంబంధం లేకుండా సినిమా అయినా ఎంటర్టెన్మెంటుతో ఇంట్రెస్టుగా సాగుతుందా అంటే అదీ లేదు. హిట్ సినిమాల రీమేక్ అంటే ఆ బాషలోని కథని, సీన్లను ఉన్నది ఉన్నట్లు దించితే హిట్టవుతుందని భావించడం పొరపాటే. అన్ని సందర్భాల్లోనూ ఈ సూత్రం వర్కౌట్ కాదు. కొన్ని సార్లు ప్రేక్షకులు నేటివిటీ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. మనది కాదని వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలా ప్రేక్షకులు ఇష్టడపక పోవచ్చు. ‘రైట్ రైట్' సినిమా విషయంలోనూ అలానే జరిగింది. సన్నివేశాలన్నీ కేరళని పోలిన లొకేషన్లతో కనిపిస్తాయి. దీంతో ఎక్కడా ఇది మన కథ అనే భావన ప్రేక్షకుడికి కలగని పరిస్థితి. అలా అని సినిమాలోని లొకేషన్లని, వాతావరణాన్ని తప్పుబట్టడం కాదు...వాటిని ప్రేక్షకులు ఇష్టపడటం వేరు, ఆ వాతావరణంలో లీనం అవడం వేరు. ఈ తేడా దర్శకుడు గమనించలేదని స్పష్టమవుతోంది. సినిమా క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగా తెరకెక్కించలేదు. ‘రైట్ రైట్' సినిమా చూసిన వారినెవరైనా సినిమా ఎలా ఉందని అడిగితే.... వారి నోటి నుండి ‘రైట్ రైట్' అనే రిప్లై వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

రైట్ రైట్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రైట్ రైట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+